మంచి నడవడికను నేర్పేదే మతం


Tue,December 13, 2016 12:51 AM

ఇటిక్యాల : మతం మనిషికి మంచి నడవడికను నేర్పాలని మాజీ ఎంపీ , ఎంపి తెరాసనేత మంద జగన్నాథ్ అన్నారు. సోమవారం మండంలోని కొండేరు గ్రామంలోగల తన స్వగృహంలో క్రిస్‌మస్ పండుగను పురష్కరించుకొని జిల్లాలోని పాస్టర్లకు దుస్తులను పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మతం సమాజంలో సౌభ్రాతృత్వాన్ని పెంపొందింపజేయాలని మంచినడవడికను అలవరచుకొనేదిగా ఉండాలన్నారు. ఎవరు ఏ మతాన్ని అవలంబించినా నీమతం గొప్పది నామతం గొప్పదనే భేషజాలకు పోకూడదన్నారు. ఈ సందర్భంగా పాస్టర్లు తమకు ప్రభుత్వపరంగా నెలసరివేతనం ఇప్పించేందుకు కృషిచేయాలని కోరగా విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళతానన్నారు. ఈ కార్యక్రమంలో మంద శ్రీనాథ్, వడ్డేపల్లి శ్రీనివాసులు, బండ్లచంద్రశేఖర్‌రెడ్డి, రాంరెడ్డి, మహేశ్వర్‌రెడ్డి, విక్రమ్‌సేనారెడ్డి, రెవరెండ్ ప్రభాకర్‌రెడ్డి, ఎంజీ కృష్ణ పాల్గొన్నారు.

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...