మల్లూరులో భక్తుల రద్దీ


Sun,December 15, 2019 02:45 AM

మంగపేట, డిసెంబర్‌ 14: మల్లూరు హేమాచల ల క్ష్మీనర్సింహస్వామిని వివిధ ప్రాంతాల భక్తులు శనివారం దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమెరికాకు చెందిన పలువురు భక్తులు గుట్టకు వచ్చారు. లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకున్నారు. గుట్టపై చిం తామణి జలపాతాన్ని సందర్శించారు. గర్భ గుడి ఎదుట స్వామి వారికి పూజలు చేశారు. ఆలయ ప్రధానార్చకులు కైంకర్యం రాఘవాచార్యులు భక్తులకు లక్ష్మీనర్సింహస్వామి ఆలయ చరిత్రను వివరించారు. అర్చకులు లక్ష్మీనర్సింహస్వామికి తిల తైలాభిషేకాలు జరిపారు. ఆయా ప్రాంతాల నుంచి దర్శనానికి వచ్చిన భక్తుల పేర అర్చకులు జరిపించి, ఆశీర్వదించారు. ఆలయ ఈవో సత్యనారాయణ, అర్చకులు రాఘవాచార్యులు, ముక్కమాల రాజశేఖర్‌శర్మ, పవన్‌కుమార్‌ ఆచార్యులు, ఈశ్వర్‌చందుశర్మ, సుధీర్‌, సీతారాములు పాల్గొన్నారు.

28

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles