మత్య్స కారులకు ప్రభుత్వం చేయూత


Fri,December 13, 2019 02:07 AM

-జెడ్పీచైర్‌పర్సన్‌ జక్కు శ్రీహర్షిణి
-లక్ష్మీ బరాజ్‌లో రొయ్య పిల్లల విడుదల


మహదేవపూర్‌, డిసెంబర్‌ 12: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మత్స్యకారులకు చేయూతనిస్తున్నదని, ఉపాధి కోసం చేప, రొయ్య పిల్లలను విడుదల చేస్తున్నదని జెడ్పీ చైర్‌పర్సన్‌ జక్కు శ్రీహర్షిణి పేర్కొన్నారు. అంబట్‌పల్లి పరిధిలో నిర్మించిన లక్ష్మీ బరాజ్‌లో రొయ్య పిల్లలను ఆమె గురువారం విడుదల చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్ట్‌ సాగు నీటి అవసరాలకే కాకుండా మత్స్యకారులకు వరంగా మారిందని తెలిపారు. సీఎం కేసీఆర్‌ ముందుచూపుతో కాళేశ్వరం బహుళ లాభాలు తేబోతున్నదని చెప్పారు. రాబోయే రోజుల్లో మహదేవపూర్‌ మండలం చేపల మార్కెట్‌కు కేంద్రమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మత్స్యకారులకు ఉపాధి కల్పించి వారి అభ్యున్నతే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ కంకణం కట్టుకున్నారని తెలిపారు. అందుకే వాహనాలు పంపిణీ చేస్తున్నారు. జిల్లాకు మరిన్ని వాహనాలు వచ్చేలా కృషి చేస్తానన్నారు. ప్రస్తుతం ఇతర రాష్ర్టాల నుంచి చేప, రొయ్యలను రాష్ర్టానికి దిగుమతి చేసుకుంటున్నామని, వచ్చే ఏడాది భూపాలపల్లి జిల్లా కేంద్రంగా చేప, రొయ్యల ఉత్పత్తిని పెంచి ఇతర రాష్ర్టాలకు ఎగుమతి చేసేలా ఎదగాలని సూచించారు. మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు మాట్లాడుతూ మహదేవపూర్‌ కేంద్రంగా చేపల మార్కెట్‌ కమిటీ ఏర్పాటు చేసి మత్స్య సహకార సంఘాల ఆధ్వర్యంలో మార్కెట్‌ జరిగేలా అధికారులు చొరవ తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ బన్సోడ రాణిబాయి, జెడ్పీటీసీ గుడాల అరుణ, ఎంపీటీసీ జయశ్రీ, సర్పంచ్‌ విలాస్‌రావు, కాళేశ్వరం ఈఈ వెంకటరమణారెడ్డి, డీఈ సురేశ్‌, మత్స్యశాఖ జిల్లా అధికారి భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

61

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles