రామప్ప శిల్పకళా నైపుణ్యం అద్భుతం


Fri,December 13, 2019 02:05 AM

వెంకటాపూర్‌, డిసెంబర్‌ 12: రామప్ప దేవాలయ శిల్పకళా నైపుణ్యం అద్భుతమని వివిధ రాష్ర్టాలకు చెందిన శిక్షణ ఐపీఎస్‌లు కొనియాడారు. 10 మంది శిక్షణ ఐపీఎస్‌లు రామప్ప ఆలయాన్ని గురువారం సందర్శించారు. ఆలయ ప్రధాన పూజారులు కోమళ్లపల్లి హరీశ్‌ శర్మ, ఉమాశంకర్‌ వారికి స్వాగతం పలికారు. రామలింగేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేశారు. తీర్థప్రసాదాలు అందజేశారు. టూరిజం గైడ్‌ వెంకటేశ్‌, విజయ్‌ వారికి రామప్ప ఆలయ విశిష్టతను వివరించారు. ఆలయ కల్యాణ మండపంలో శిక్షణ ఐపీఎస్‌లు మాట్లాడారు. నల్లరాయితో తయారు చేసిన మదనికలు, చెక్కు చెదరని నందీశ్వరుడి ప్రతిమ అద్భుతంగా ఉన్నాయని చెప్పారు. రామప్ప శిల్పాల్లో జీవకళ ఉట్టిపడుతున్నదని, కాకాతీయ కళాదర్పణం, శిల్పకళా సోయగం రామప్ప సొంతమని అభివర్ణించారు. ఇలాంటి శిల్పాలను తాము ఎక్కడా చూడలేదని, ఘన చరిత్ర ఉన్న రామప్పను సందర్శించడం గొప్పవిషయమన్నారు. అనంతరం వారు లక్నవరం పర్యాటక ప్రాంతాన్ని సందర్శించారు. వేలాడే వంతెనలపై నడిచారు. సరస్సులో బోటింగ్‌ చేశారు. వారి వెంట ములుగు సీఐ దేవేందర్‌రెడ్డి, ఎస్సై నరహరి, గైడ్స్‌ పాల్గొన్నారు. అలాగే, రామప్ప దేవాలయాన్ని ఫ్రాన్స్‌కు చెందిన వ్యాన్‌స్మిత్‌హగ్గిన్‌ గురువారం సందర్శించారు. రామలింగేశ్వరుడికి పూజలు చేసి, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. రామప్ప దేవాయలంలోని శిల్పాలను తన కెమెరాలో బంధించారు. బోటింగ్‌ చేసి ప్రకృతి అందాలను తిలకించారు.

49

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles