సరస్వతీ బరాజ్‌కు 8,480 క్యూసెక్కుల నీరు తరలింపు


Fri,December 13, 2019 02:05 AM

కాళేశ్వరం, డిసెంబర్‌ 12: లక్ష్మీ(కన్నెపల్లి) పంప్‌హౌస్‌ నుంచి రోజూ 8,480 క్యూసెక్కుల నీటిని సరస్వతీ బరాజ్‌కు తరలిస్తున్నట్లు ఇంజినీరింగ్‌ అధికారులు తెలిపారు. లక్ష్మీ పంప్‌హౌస్‌లోని 3వ, 7వ, 9వ, 11వ మోటర్లు గురువారం నిరంతరం నడిపి 8,480 క్యూసెక్కుల నీటిని అన్నారం బరాజ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. మోటర్ల నుంచిఇ వస్తున్న నీరు గ్రావిటీ కెనాల్‌ డెలివరీ సిస్టర్న్‌ వద్ద 8 పైపుల నుంచి కిందికి దూకుతూ గ్రావిటీ కెనాల్‌లో ప్రవహిస్తూ అన్నారం (సరస్వతీ)బరాజ్‌కు చేరుతున్నాయి. ఆ బరాజ్‌లో 10.87 టీఎంసీల సామర్థ్యానికి గానూ 7.39 టీఎంసీ నీరు నిల్వ ఉందని అధికారులు చెప్పారు.

48

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles