కూటి కోసం కోటి విద్యలు


Fri,December 13, 2019 02:05 AM

ఈ చిత్రాల్లో కనిపిస్తున్నది పగటి వేషగాళ్లు. వీరిని ‘బహు రూపు లు’గా పిలుస్తారు కూడా. వీరు సంచార జీవనం సాగిస్తుంటారు. ఊ రూరూ తిరుగుతూ ప్రదర్శనలు ఇస్తారు. రోజుకో వేషం వేస్తారు. ప్రజల కు వినోదం అందించి, సంభావనలు తీసుకుంటూ పొట్టపోసు కుం టారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా తొర్రూరు గ్రామానికి చెందిన సా యిలు, హేమలత దంపతులు సంప్రదాయంగా వస్తున్న కళలో భాగం గా పగటి వేషాలు వేస్తూ ఊరూరూ తిరుగుతారు. ఈ క్రమంలో ములు గు జిల్లా వెంకటాపూర్‌ మండల కేంద్రానికి నాలుగు రోజుల క్రితం చేరుకున్నారు. మొదటి రోజు ఫక్కీర్‌ సాహెబ్‌ వేషం వేసి ఆక ట్టుకు న్నారు. రెండో రోజు బ్రహ్మంగారి వేషధారణలో తిరుగుతూ కాలజ్ఞానా న్ని చెప్పారు. మూడో రోజు లంబాడీ వేషధారణ, గురువారం కాళికా మాత వేషధారణతో గ్రామస్తులకు ఆకట్టుకున్నారు. శుక్రవాం భేతాళ రూపంలో ప్రదర్శన ఇస్తామని సాయిలు పేర్కొన్నాడు. ప్రదర్శన పూర్తయిన తర్వాత ఇల్లిల్లూ తిరిగి, సంభావన అడుతామని, తోసినంత సాయం చేస్తే తీసుకుని, మరో గ్రామానికి వెళ్తామని, 20 ఏళ్లుగా ఈ వేషాలతో పొట్టపోసుకుంటున్నట్లు ఆయన చెప్పుకొచ్చాడు.-వెంకటాపూర్‌ విలేకరి

39

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles