దివ్యాంగులు దైవసమానులు


Thu,December 12, 2019 02:26 AM

మంజూర్‌నగర్‌, డిసెంబర్‌ 11: దివ్యాంగులు దైవసమానులని, సాధారణ పౌరుల కంటే బుద్ధిబలంలో ముందుంటారని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. జిల్లా సంక్షేమాధికారి సీహెచ్‌ అవంతి, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖాధికారి జే సుమతి ఆధ్వర్యంలో ప్రగతిభవన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన ప్రపంచ దివ్యాంగుల దినోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దివ్యాంగత్వం శాపం కాదని, వారిలో మానసిక ైస్థెర్యం ఎక్కువని తెలిపారు. దివ్యాంగులు భవిష్యత్‌ కార్యాచరణను రూపొందించుకొని రాజకీయ నాయకులుగా, క్రీడాకారులుగా, ఉన్నతాధికారులుగా ఎదిగారని, వారిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. దివ్యాంగులుగా పుట్టిన నాటి నుంచి జీవన పోరాటంలో అలుపెరగని సైనికుల్లా పని చేస్తున్న వారు ఎందరో ఉన్నారని, వారిని గుర్తించి తెలంగాణ ప్రభుత్వం నెలకు రూ. 3016 పింఛన్‌ ఇస్తున్నదని చెప్పారు.


ట్రై సైకిళ్లు, స్కూటర్లు, ల్యాప్‌టాప్‌ ఇస్తున్నదని, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నదని వివరించారు. అవసరమైన వారికి ఉ పాధి, ఉద్యోగావకాశాలు కల్పిస్తామని, టీఆర్‌ఎస్‌ నుంచి ము న్సిపల్‌ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పిస్తామన్నారు. దివ్యాంగుల సంఘం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ నర్సింగారావు, జిల్లాధ్యక్షుడు కొమ్ము సురేందర్‌రెడ్డి తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. నవంబర్‌ 28న నిర్వహించిన క్రీడ ల్లో గెలుపొందిన దివ్యాంగులను ఎమ్మెల్యే సన్మానించి, బహుమతులు ప్రదానం చేశారు. దివ్యాంగులకు ట్రై సైకిళ్లు అందజేశారు. మహిళా ఆర్గనైజర్‌ చింతల భారతిరెడ్డి, జెడ్పీ సీఈవో శిరీష, జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి సునీత, దివ్యాంగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నీలాంబరం, తెలంగాణ జాగృతి జిల్లా దివ్యాంగుల సంఘం అధ్యక్షుడు వంగ నర్సయ్య, హెచ్‌ఎంఆర్‌డీఎస్‌ దివ్యాంగుల స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు రజిత, బాలల సంరక్షణ అధికారి వెంకట్‌, డీఆర్‌డీఏ ఏవో వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

54

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles