ప్రజల మన్ననలు పొందాలి


Thu,December 12, 2019 02:25 AM

అర్బన్‌ కలెక్టరేట్‌, డిసెంబర్‌11 : ఐదో జోన్‌ పరిధిలో డిప్యూటీ తహ సీల్దార్లుగా ఎంపికైన వారు నిజాయతీగా పని చేసి ప్రజల మన్ననలు పొందాలని అర్బన్‌ కలెక్టర్‌ ప్రశాంత్‌జీవన్‌ పాటిల్‌ సూచించారు. టీఎస్‌పీఎస్‌సీ ద్వారా డిప్యూటీ తహసీల్దార్లుగా 103 మంది అభ్యర్థులు ఎంపిక కాగా, వరంగల్‌ అర్బన్‌ కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో బుధవారం సర్టిఫికెట్లు పరిశీలించి, నియామక ఉత్తర్వులు అందజేశారు. కార్యక్రమానికి 4గురు గైర్హాజరు అయ్యారు. 7గురు ఎస్టీ అభ్యర్థులకు సంబంధించి కుల ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు పంపించారు. 92 మందికి నియామక ఉత్తర్వులు కలెక్టర్‌ అందజేశారు. ఇందులో జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాకు చెందిన ద్యావనపల్లి కరుణశ్రీ ఉన్నారు. నియామక పత్రాలు పొందిన వారు 60 రోజుల్లో విధులకు హాజరయ్యే అవకాశం ఉన్నది. కార్యక్రమం సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ కొన్ని మండలాల్లో సరైన రికార్డులు లేక 10 నుంచి 15 శాతం పాస్‌బుక్కులు పెండింగ్‌లో ఉన్నాయని, ఉన్నత చదువులు చదివి ఎంపికైన వారంద రూ ప్రజలకు అందుబాటులో ఉంటూ జవాబుదారీగా పనిచేయాలని సూచించారు. జాయినింగ్‌ రిపోర్టును వరంగల్‌ అర్బన్‌ కలెక్టరేట్‌ కార్యాలయంలో అందజేయాలని, వీరికి ఏడాదిపాటు శిక్షణ ఉంటుందని, రెవెన్యూ చట్టాలు, ప్రభుత్వ ఉత్తర్వులు అవగాహన చేసుకోవాల్సి ఉం టుందని కలెక్టర్‌ తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు. స్పెషల్‌ కలెక్టర్‌ మనుచౌదరి, కలెక్టరేట్‌ పరిపాలన అధికారి స మ్మయ్య, కలెక్టరేట్‌ సూపరింటెండెంట్లు, ఉద్యోగులు పాల్గొన్నారు.

30

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles