రెడ్‌క్రాస్ సేవలు అభినందనీయం


Wed,December 11, 2019 06:24 AM

భూపాలపల్లి టౌన్, డిసెంబర్ 10 : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రెడ్‌క్రాస్ సేవలు అభినందనీయమని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. భూపాలపల్లిలో రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జనరిక్ మందుల షాపును గవర్నర్ మంగళవారం ప్రారంభించారు. భూపాలపల్లికి వచ్చిన గవర్నర్‌కు కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ జక్కు శ్రీహర్షిణి, స్థానిక ప్రజాప్రతినిధులు, రెడ్‌క్రాస్ ప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు. పాఠశాల విద్యార్థులు పుష్పగుచ్ఛాలు అందజేశారు. రెడ్‌క్రాస్ జనరిక్ మందుల షాపును గవర్నర్ ప్రారంభించి, మాట్లాడారు. జిల్లాలో రెడ్‌క్రాస్ సేవలు విస్తరించడం సంతోషకరమని, ఇంత తక్కువ సమయంలో 15వేల సభ్యత్వాలు చేయడం అభినందనీయమన్నారు. కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, రెడ్‌క్రాస్ ప్రతినిధులను అభినందించారు. వెంట గవర్నర్ సెక్రటరీ కే సురేంద్రమోహన్, ఏడీసీ నర్సింహన్, ఐఆర్‌సీ సీఎస్ నేషనల్ ఎంసీ మెంబర్ డాక్టర్ పెసరు విజయచందర్‌రెడ్డి, రాష్ట్ర రెడ్‌క్రాస్ సంస్థ సీఈవో మధన్‌మోహన్‌రావు, రాష్ట్ర మేనేజింగ్ కమిటీ సభ్యులు, రాష్ట్ర జూనియర్ అండ్ యూత్ రెడ్‌క్రాస్ కమిటీ సభ్యులు శ్రీనివాస్‌రావు, రాష్ట్ర మేనేజ్ కమిటీ సభ్యులు డాక్టర్ కాశెట్టి శ్రీనివాస్, శాశ్వత సభ్యులు జల్ది రమేశ్, డాక్టర్ తనూజరాణి, నాగుల దేవేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

42

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles