జాగృతి జిల్లా అధ్యక్షుడిగా డాక్టర్ రవీందర్ నియామకం


Wed,December 11, 2019 06:22 AM

ములుగు, నమస్తే తెలంగాణ : తెలంగాణ జాగృతి ములుగు జిల్లా అధ్యక్షుడిగా జిల్లా కేంద్రానికి చెందిన డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ పోరిక రవీందర్‌నాయక్‌ను జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆదేశాల మేరకు ని యమించినట్లు జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్‌చారి తెలిపారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్‌లోని కల్వకుంట్ల కవిత నివాసంలో ఆమె చేతుల మీదుగా నియామకపత్రాన్ని అందుకున్నారు. జిల్లాలోని వెంకటాపూర్ మండలం గుర్రంపేట గ్రామానికి చెందిన డాక్టర్ రవీందర్ ములు గు జిల్లా ప్రజలందరికీ సుపరిచితుడు. ఆయన ములుగు జిల్లా జాగృతి అధ్యక్షుడిగా ఎన్నిక కావడంపై పలువురు హర్షం వ్యక్తం చేసి అభినందనలు తెలిపారు. వైద్యుడిగా వృత్తిపరంగా సేవలు అందించడమే కాకుండా కళారంగంపై ఉన్న అభిమానంతో పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. మూఢనమ్మకాలను రూపుమాపేందుకు మ్యాజిక్ షోను సైతం నిర్వహించి ప్రజల మన్ననలు పొందారు. ప్రభుత్వ వైద్యుడిగా పనిచేస్తూ పేద, మధ్య తరగతి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు.

42

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles