మేడారం విశిష్టతపై విస్తృత ప్రచారం


Wed,December 11, 2019 06:22 AM

ములుగు, నమస్తే తెలంగాణ : ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం సమ్మక్క-సారలమ్మల జాతరపై విస్త్రృత ప్రచారం నిర్వహించేందుకు కలెక్టర్ చింతకుంట నారా యణరెడ్డి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జాతర 2020 ఫిబ్రవరి 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు జరుగనుంది. ఈ క్రమంలో జిల్లా నలుమూలల నుంచి జిల్లా కలెక్టరేట్ కార్యాల యానికి వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజలకు జాతర గొప్పత నం తెలుపే విధంగా కలెక్టర్ చర్యలు తీసుకుంటున్నారు. ఇందు లో భాగంగా జాతర గొప్పతనం, గిరిజనుల సంస్కృతీసంప్రదా యాల నడుమ మొక్కులు చెల్లించుకోవడంతోపాటు అనాధిగా ఎడ్లబండ్లపై జాతరకు వచ్చే పద్ధతి, బెల్లం బుట్టలతో తల్లుల సన్నిధికి రావడం, ఆదివాసీ మహిళల నృత్యాలు వంటి చిత్రాల ను కలెక్టరేట్ ప్రహరీపై జీవ కళ ఉట్టిపడే విధంగా వేయిస్తున్నారు. అదేవిధంగా తాడ్వాయి మండలంలో పరిధిలోని పలు గ్రామాల్లో సైతం కలెక్టర్ ఈ తరహా చిత్రాలను వేయించనున్నారు. హైదరా బాద్ నుంచి వచ్చిన ఎన్నోవెడ్ యాడ్స్ కంపెనీకి చెందిన ప్రతిని ధులు శ్రీను, శ్రీకాంత్‌లతో ఈ బొమ్మలను వేయించడంతోపాటు వాటిని అనుకున్న రీతిలో వచ్చే విధంగా పలు సూచనలు, సలహాలను అందిస్తూ కలెక్టర్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ములుగు జిల్లాను సంవత్సర కాలంలోనే రాష్ర్టానికి ఆదర్శంగా నిలిపే విధంగా పలు వినూత్న కార్యక్రమాలు నిర్వహించిన కలెక్టర్ ఈ చిత్రాల ద్వారా మరో అడుగు ముందుకు వేసి జాతరను సక్సెస్ చేసేందుకు పూనుకున్నారు. కలెక్టర్ నూతన ఆలోచనలపై జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమకు మంచి కలెక్టర్ వచ్చాడని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

43

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles