ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలి


Mon,December 9, 2019 01:59 AM

రెడ్డికాలనీ, డిసెంబర్‌ 8 : ప్రజలకు మెరుగైన వైద్యసేవలందించాలని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, వైద్యులకు సూచించారు. ఆదివారం నగరంలోని ములుగురోడ్‌లో 300 పడకల అజర సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌, మాజీ ఉపముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, అరూరి రమేశ్‌, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, వొడితెల సతీశ్‌కుమార్‌ కలిసి వారు ప్రారంభించారు. అనంతరం మంత్రులకు వైద్యులు బీపీ చెకప్‌ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలోని పలు విభాగాలను మంత్రులు ప్రారంభించి మాట్లాడుతూ అన్ని రకాల వైద్యం అందించేందుకు ప్రజలకు సదుపాయంగా నిర్వహించిన హాస్పిటల్‌ యాజమాన్యాన్ని మంత్రులు అభినందించారు. ఈ సందర్భంగా ఆస్పత్రి ప్రాజెక్టు డైరెక్టర్‌ శ్రీకాంత్‌ మాట్లాడుతూ 24 గంటలు అత్యవసర వైద్యంతో పాటు అంతర్జాతీయ స్థాయి వైద్యం, ఓపెన్‌హార్ట్‌ సర్జరీ, ఆర్థోపెడిక్‌, కిడ్నీ, లంగ్‌ యూనిట్‌, స్ట్రోక్‌ యూనిట్‌, డయాబెటిక్‌ యూనిట్‌, సైకియాట్రిక్‌ వంటి ప్రత్యేక బ్లాక్‌లు ఏర్పాటు చేశామని చెప్పారు. సిటీ స్కాన్‌, క్యాథ్‌ల్యాబ్‌, ఎక్స్‌రే, అల్ట్రాసౌండ్‌ స్కాన్‌, రోగ నిర్దారణ పరీక్షలు చేస్తామని తెలిపారు.


ఆస్పత్రి చైర్మన్‌ డాక్టర్‌ బీ శివసుబ్రహ్మణ్యం, ఎండీ డాక్టర్‌ ఎం.శేషుమాధవ్‌ మాట్లాడుతూ తెలంగాణలో హైదరాబాద్‌ తర్వాత అత్యాధునిక సౌకర్యాలు, ఆధునిక టెక్నాలజీతో ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు ఆస్పత్రి ప్రారంభించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌వో డాక్టర్‌ హరీశ్‌రాజ్‌, నగర పోలీస్‌ కమిషనర్‌ విశ్వనాథ రవీందర్‌, జెడ్పీ ఛైర్మన్‌ సుధీర్‌కుమార్‌, మేయర్‌ గుండా ప్రకాశ్‌రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌ అజీజ్‌ఖాన్‌, రాష్ట్ర వికలాంగుల సంస్థ ఛైర్మన్‌ వాసుదేవరెడ్డి, కుడా ఛైర్మన్‌ మర్రి యాదవరెడ్డి, రాష్ట్ర నాయకులు గుడిమల్ల రవికుమార్‌, ఆస్పత్రి డైరెక్టర్లు డాక్టర్‌ ఎన్‌.వెంకటరమణ, డాక్టర్‌ ఏరుకొండ శ్రీధర్‌, డాక్టర్‌ పి.ప్రవీణ్‌, డాక్టర్‌ అప్పాల సుధాకర్‌, డాక్టర్‌ విశ్వనాథ అశోక్‌, డాక్టర్‌ సాయిని వెంకటేశ్వర్లు, డాక్టర్‌ ఎన్‌.విద్యాసాగర్‌, ఐఎంఏ అధ్యక్షులు కొత్తగట్టు శ్రీనివాస్‌, డాక్టర్‌ కృపాదానం, డాక్టర్‌ పోలా నటరాజ్‌, డాక్టర్‌ కాళీప్రసాద్‌, డాక్టర్‌ హరిరమాదేవి, ప్రశాంతి ఆస్పత్రి ఛైర్మన్‌ తూము మోహన్‌రావు, డాక్టర్‌ బందెల మోహన్‌రావు, డాక్టర్‌ రామక శ్రీనివాస్‌, డాక్టర్‌ లోకనాథం, డాక్టర్‌ నర్సింగారావు, డాక్టర్‌ తాళ్ల రవి, ఆస్పత్రి సీఈవో శ్రీనివాస్‌, కార్పొరేటర్లు వేముల శ్రీనివాస్‌, బయ్య స్వామి, బోయినపల్లి రంజిత్‌రావు, బోడ డిన్నా, మాధవి పాల్గొన్నారు.

68

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles