వనదేవతల సన్నిధిలో భక్త్తుల సందడి


Mon,December 9, 2019 01:58 AM

తాడ్వాయి, డిసెంబర్‌ 08 : ఆదివాసీ గిరిజన దైవాలైన మేడారం సమ్మక్క-సారక్కలను దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్య లో తరలివచ్చారు. ఆదివారం సెలవు దినం కావడంతో రాష్ట్ర నలు మూలల నుంచే కాకుండా పక్క రాష్ర్టాలైన ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, ఒరిస్సా తదితర రాష్ర్టాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో అమ్మవార్ల సన్నిధికి తరలివచ్చారు. మొదటగా జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం వాగు ఒడ్డున గల జంపన్నగద్దెకు, నాగులమ్మల గద్దెల వద్ద ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తల్లు ల గద్దెల వద్దకు చేరుకుని సమ్మక్క-సారక్క, గోవిందరాజు, పగిడిద్దరాజుల గద్దెలపై పసుపు, కుంకుమ, ఎత్తుబెల్లం, నూతన వస్ర్తా లు, పూలు, పండ్లు సమర్పించి గిరిజన సంప్రదాయ పద్ధతులలో అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. తల్లుల మొక్కులకు అనుగుణంగా యాటపోతులు, కోళ్లు సమర్పించారు. గద్దెల పరిసరాలతోపాటు చిలుకలగుట్ట, జంపన్నవాగు, ఆర్టీసీ బస్టాండ్‌ తదితర ప్రాం తాల్లో చెట్లకింద విడిదిచేశారు. వంటలు చేసుకుని బంధు, కుటుంబ సమేతంగా విందు భోజనాలు చేశారు.

51

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles