పదకొండు మత్స్య పారిశ్రామిక సంఘాలు


Sat,December 7, 2019 02:29 AM

భూపాలపల్లి, నమస్తే తెలంగాణ : జిల్లాలో మరో పదకొండు నూతన పురుష, మహిళ మత్స్య పారిశ్రామిక సంఘాల ఏర్పాటుకు ప్రతిపాదనలను జిల్లా మత్స్యశాఖ సిద్ధం చేసింది. మత్స్య పారిశ్రామిక సహకార సంఘం(పురుషులకు)సంబంధించి మహదేవ్‌పూర్ మండలం రాపెల్లికోట, కాటారం మండలంలోని గంగపురి, వీరాపూర్, జాదవరావుపేట, మల్హర్ మండలం పర్లపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేయనున్నారు. మత్స్య పారిశ్రామిక సంఘం(మహిళలకు)సంబంధించి గణపురం మండలం చెల్పూర్, బుర్రకాయలగూడెం, గాంధీనగర్, రేగొండ మండలం గోరికొత్తపల్లి, మల్హర్ మండలం తాడిచర్ల, మొగుళ్లపల్లి మండల కే్రందంలో ఈ సంఘాలు నూతనంగా ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు రూపొందించినట్లు జిల్లా మత్స్యశాఖ ఏడీ జే భాస్కర్ నమస్తే తెలంగాణకు శుక్రవారం తెలిపారు. ఈ పదకొండు సంఘాల్లో 840మంది సభ్యులు ఉన్నట్లు ఆయన వెల్లడించారు.

48

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles