నాలుగు మోటర్లతో పంపింగ్


Sat,December 7, 2019 02:29 AM

కాళేశ్వరం, డిసెంబర్ 6: కాళేశ్వరంలోని లక్ష్మీ (కన్నెపల్లి) పంప్‌హౌస్‌లో శుక్రవారం నాలుగు మోటర్లు నడిపినట్లు ఇంజినీర్లు తెలిపారు. 3వ, 4వ, 5వ, 7వ మోటర్లు నిరంతరం నీటిని ఎత్తిపోస్తున్నట్లు పేర్కొన్నారు. అన్నారం బరాజ్‌కు శుక్రవారం 8,480 క్యూసెక్కుల నీటిని తరలించినట్లు తెలిపారు. మోటర్ల నుంచి వస్తున్న నీరు గ్రావిటీ కెనాల్ డెలివరీ సిస్టర్న్ వద్ద 8 పైపుల నుంచి ఎత్తిపోస్తున్నాయి. ఆ నీరు సరస్వతీ బరాజ్‌కు తరలుతున్నది. ఆ బరాజ్ లో 7.39 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఇంజినీర్లు తెలిపారు.

61

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles