అణగారిన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్


Sat,December 7, 2019 02:29 AM

ములుగు, నమస్తే తెలంగాణ: సమాజంలోని అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడి, రాజ్యాంగాన్ని లిఖించిన ఆశాజ్యోతి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని ములుగు జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ పేర్కొన్నారు. అంబేద్కర్ 63వ వర్ధంతిని మల్లంపల్లి గ్రామంలో శుక్రవారం నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ మాట్లాడుతూ సమాజంలో అసమానతలను రూపుమాపడం కోసం తన జీవితా న్ని త్యాగం చేసిన మహనీయుడు అంబేద్కర్ అని కొనియాడారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగంతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం నేడు సీఎం కేసీఆర్ నేతృత్వంలో అన్ని రంగాల్లో దేశంలో ఆదర్శ రాష్ట్రంగా నిలిచిందని తెలిపారు. అంబేద్కర్ ఆశయ సాధనకు నిరంతరం పోరాడుతూ, వారి బాటలో పయనిస్తూ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు బాదం ప్రవీణ్, సర్పంచ్ చంద కుమారస్వామి, ఎంపీటీసీ మాచర్ల ప్రభాకర్, ఇతర నాయకులు పాల్గొన్నారు.

47

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles