మహిళా సమస్యలపై స్పందించాలి


Fri,December 6, 2019 02:56 AM

కలెక్టరేట్‌, డిసెంబర్‌ 5: జిల్లాలోని మహిళలు, పిల్లల సమస్యలపై సత్వరమే స్పందించాలని, వారి పరిష్కారానికి చొరవ చూపాలని జాయింట్‌ డైరెక్టర్‌ సబిత ఆదేశించారు. మహిళలు, పిల్లలపై జరుగుతున్న వేధింపులు, జిల్లాలో కొనసాగుతున్న వివిధ సంక్షేమ పథకాలపై జాయింట్‌ డైరెక్టర్‌ సబితా, ఆర్జేడీ సునందతో కలిసి జిల్లా మహిళా సంక్షేమ అధికారులతో గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా రాష్ట్ర జాయింట్‌ డైరెక్టర్‌ మాట్లాడుతూ ప్రస్తుతం మహిళలు, పిల్లలపై జరుగుతున్న శారీరక, మానసిక వేధింపులపై విస్తృతస్థాయిలో అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. మహిళలు, పిల్లలకు ఈ రకమైన వేధింపులను ఎదుర్కొనేలా చైతన్య పర్చాలని ఆదేశించారు. మహిళలు, పిల్లలు శారీరక, మానసిక వేధింపులకు గురైతే 100, 1098, 112, షీ టీమ్స్‌ తదితర టోల్‌ఫ్రీ నంబర్లకు ఫోన్‌ చేయాలని కోరారు. హాక్‌ ఐ మొబైల్‌ అప్లికేషన్‌ను వినియోగించుకొని రక్షణ పొందే అవకాశం ఉం దని చెప్పారు. టోల్‌ ప్రీ నెంబర్లు, ఇతర సమాచారంతో కూడిన హోర్డింగ్‌లను జిల్లా, మండల కేంద్రాలు, బస్టాండ్‌ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని, లైంగిక దాడులకు గురైన మహిళలు, పిల్లలకు సత్వర సాయం కింద పరిహారం అందిస్తామన్నారు. మహిళలు, పిల్లల సంరక్షణ బాధ్యత మహిళా, శిశు సంక్షేమ శాఖల అధికారులదేనని వెల్లడించారు. ఎంఎస్‌కే, సఖీ, ఐసీడీఎస్‌, ఐసీపీఎస్‌ శాఖలకు సంబంధించిన సమాచారం తెలుసుకున్నారు. శాఖల వారీగా చేయాల్సిన పనులపై సూచనలిచ్చారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి సీహెచ్‌ అవంతి, మహదేవ్‌పూర్‌ సీడీపీవో ఆర్‌ రాధిక, బీఆర్‌బీ కో-ఆర్డినేటర్‌ కే శిరీష, డీసీపీవోపీ శ్రీకన్య తదితరులు పాల్గొన్నారు.

45

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles