మెరుగైన విద్య అందించడమే లక్ష్యం


Fri,December 6, 2019 02:56 AM

కరీమాబాద్‌, డిసెంబర్‌ 5: ప్రభుత్వ విద్యాలయాల ద్వారా విద్యార్థులకు మెరుగైన విద్య అందించడమే లక్ష్యమని డీఈవో నారాయణరెడ్డి పేర్కొన్నా రు. మహాత్మా జ్యోతి బా పూలే తెలంగాణ బీసీ వెల్ఫేర్‌ సొసైటీ ఆధ్వర్యంలో 3 రోజుల ఉమ్మడి జిల్లా స్థాయి లిటరరీ అండ్‌ కల్చరల్‌ కార్నివాల్‌ కార్యక్రమం ఎంజేపీ గురుకుల పాఠశాల ఉర్సు గుట్టలో ప్రిన్సిపాల్‌ అంజిరెడ్డి అధ్యక్షతన గురువారం ఏర్పాటు చేశారు. డీఈవో జ్యోతి ప్రజ్వలన చేసి కా ర్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థుల్ల్లో దాగి ఉన్న ప్రతిభను, సృజనాత్మకశక్తిని వెలికితీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని చెప్పారు. కాగా, ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని 8 బీసీ వెల్ఫేర్‌ పాఠశాలల విద్యార్థినులు పోటీల్లో పాల్గొన్నారు. విద్యార్థులు చేపట్టిన సంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఆయా పాఠశాలల ప్రిన్సిపాల్స్‌ రాజేంద్రచారి, ఈశ్వర్‌కుమార్‌, లక్ష్మినర్సయ్య, రాజేంద్రప్రసాద్‌, ప్రోగ్రాం కన్వీనర్‌ వనజ, ఏటీపీ సంధ్య తదితరులు పాల్గొన్నారు.

జయగిరిలో కార్నివాల్‌..
హసన్‌పర్తి : వరంగల్‌ అర్బన్‌ జిల్లా జయగిరిలో కమలాపూర్‌ మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల బాలుర పాఠశాలలో సాంస్కృతిక, సాహిత్య కార్నివాల్‌ కార్యక్రమం గురువారం జరిగింది. మూడు రోజుల పాటు నిర్వహించే వివిధ సాంస్కృతిక, సాహిత్య వేడుకలు కొనసాగనున్నాయి. కమలాపూర్‌ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ప్రసాద్‌, కన్వీనర్‌ తిమ్మపూర్‌ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ సోమయాజులు, రేగొండ ప్రిన్సిపాల్‌ రేగొండ కనకయ్య, గిర్నివాల్‌ ప్రిన్సిపాల్‌ దేవేందర్‌, సర్పంచ్‌ బొల్లం రాణి, ఎంపీటీసీ పల్లె విజయ తదితరులు పాల్గొన్నారు.

53

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles