అక్రమ క్వారీలు.. అడ్డదారులు..!


Wed,December 4, 2019 03:15 AM

-బండ్లబాటలే రాచమార్గాలు
-వాగులను తోడుతున్న స్మగ్లర్లు
-అక్రమార్కులకు కొందరు అధికారుల అండదండలు
-పట్టించుకోని అటవీ, రెవెన్యూ శాఖలు
-చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్న పోలీసులు
-జిల్లాలో ఇసుక మాఫియా ఇష్టారాజ్యం


జయశంకర్ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : భూపాలపల్లి జిల్లాలో ఇసుక అక్రమ నిల్వలు ఊరూ రా పేరుకుపోతున్నాయి. అనధికారికంగా క్వారీలు నిర్వహిస్తూ ఇసుకను యథేచ్ఛగా తోడుతుండడంతో వాగులు, వంకలు వట్టిపోతున్నాయి. అంతా చూస్తు న్న అటవీ, రెవెన్యూ, మైనింగ్ శాఖల అధికారులు పట్టించుకున్న పాపాన పోవడంలేదు. దీంతో ఇసుక మాఫియా ఆరు ట్రాక్టర్లు.. మూడు క్వారీలుగా వర్థిల్లుతున్నది. జిల్లాలోని ఏజెన్సీ మండలాలతో పాటు చిట్యాల, రేగొండ మండలాల్లో ఇసుకాసురులు అవినీతి అధికారులతో చేతులు కలిపారు. వారి అండదండలతో యథేచ్ఛగా ఇసుక అక్రమ సామ్రాజ్యాన్ని ని ర్మించుకున్నారు. కొందరు పోలీసు, రెవెన్యూ, అటవీ, మైనింగ్ అధికారులు ఆమ్యామాలతో సరిపెట్టుకొని చూసీచూడనట్లు వదిలేస్తుండగా, ఇసుకాసురులు ని బంధనలు అతిక్షికమించి, లక్షలాది రూపాయల ప్రభు త్వ ఆదాయానికి గండి కొడుతున్నారు.

అటవీ ప్రాంతంలో అలవోకగా..
జిల్లా కేంద్రం సమీపంలోని తీగలవాగు, బొగ్గులవాగు, గద్దెకుంట వాగు, మోరంచపల్లి వాగు, దూదేకులపల్లి సమీపంలోని పెద్దవాగు, అన్‌సాన్‌పల్లి శివారులోని అటవీ ప్రాంతంలో వాగులు, వంకల నుంచి నిత్యం వందలాది ట్రాక్టర్లలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు. భూపాలపల్లి పట్టణంతో పాటు చుట్టుపక్కల మండలాలకు తరలించి, నిల్వ చేస్తున్నారు. కొందరు క్షేత్రస్థాయి అటవీ అధికారుల, సిబ్బంది అండదండలతో నిషేధిత అటవీ ప్రాంతం నుంచి ఇసుకను తరలిస్తున్న దృశ్యాలు కళ్ల ముందు కనిపిస్తున్నా, జిల్లా అటవీ కార్యాలయం ముందు నుంచి ట్రాక్టర్లు తరలి ఆ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. ఇసుక తరలింపుతో ఆయా ప్రాంతాలు బొందలగడ్డలుగా మారుతున్నాయి. వాగులు, వంకలు వట్టిపోయి, భూగర్భ జలాలకు ఇబ్బందులు ఏర్పడే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

కుప్పలు తెప్పలు..
భూపాలపల్లి పట్టణంతో పాటు ప్రతి పల్లెలోనూ ఇసుక అక్రమ క్వారీలు కుప్పలు తెప్పలుగా కనిపి స్తున్నాయి. పదకొండు మండలాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. భూపాలపల్లి జిల్లా బొగ్గు గనులకు, విద్యుత్ ఉత్పత్తికి నిలయం. ఈ జిల్లాలో అనేక వాగులు, వంకలు, అపారమైన ఇసుక సంపద ఉన్నాయి. ప్రకృతి అందించిన ఇసుకను మాఫియా కొల్లగొడుతున్నది. జిల్లా వ్యాప్తంగా ఉన్న ట్రాక్టర్ల యజమానులు దీనిని వ్యాపారంగా మలుచుకున్నారు. సంధ్య వేళ మొ దలు తెల్లవారుజాము వరకూ ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తరలిస్తూ, టిప్పర్లు, లారీల ద్వారా జిల్లాల సరిహద్దులు దాటిస్తున్నారు. ప్రధానంగా భూపాలపల్లి, చిట్యాల, రేగొండ మండలాల్లో ఈ దందా వేళ్లూనుకుపోయింది. కొన్ని గ్రామాల్లో ట్రాక్టర్ల యజమానులు ఇసుక తెచ్చి తమ ఇళ్ల వద్ద డంపులు పోసి ఉంచుతారు. అవసరం ఉన్న వారికి, డిమాండ్‌ను బట్టి రేటు నిర్ణయించి, విక్రయిస్తారు.

లెక్క, పత్రం ఉండవు..
భూపాలపల్లి పట్టణంలో కొందరు అవినీతి అధికారుల కనుసన్నల్లో ఇసుక క్వారీల నిర్వహణ సాగుతున్నది. బాంబులగడ్డ, కారల్‌మార్క్స్ కాలనీతో పాటు పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ఇసుక క్వారీలు రోడ్ల పక్కనే ఏర్పాటు చేశారు. అధికారులు నిత్యం తిరిగే ప్రాంతాల్లోనూ ఈ దృశ్యాలు కనిపిస్తుంటాయి. కానీ, ఏ ఒక్క క్వారీ నిర్వాహకుడిపైనా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. క్వారీలకు అనుమతి తీసుకుని, ఇసుక ఎక్కడి నుంచి వచ్చింది..?, నిల్వ ఎంతుం ది..?, ఎవరికి ఎంత విక్రయించారు..? అనే వివరాలతో పాటు స్టాక్ రిజిస్టర్‌ను క్వారీల నిర్వాహకులు నిర్వహించాలి. కానీ, అనుమతులు తీసుకోకుండా క్వారీలు కొనసాగుతుండడం భూపాలపల్లి జిల్లాకే మచ్చలా మిగులుతోంది. పట్టణంలో, మండల కేంద్రంలో ట్రాక్టర్ల యజమానులు ఇసుక డంపులను మెయింటెన్ చేస్తున్నారంటే పోలీసు, రెవెన్యూ, అటవీ, మైనింగ్ శాఖలు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నా యో అర్థం చేసుకోవచ్చు.

అధికారుల కనుసన్నల్లోనే..
ఇసుక అక్రమ దందా పలువురు అధికారుల కనుసన్నల్లోనే కొనసాగుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా అటవీ శాఖ, రెవెన్యూ శాఖకు చెందిన కొందరు అధికారులు, సిబ్బంది డైరెక్షన్‌లోనే ఇసుక తరలి ప్రచారం జరుగుతున్నది. ఈ విషయాన్ని కొందరు ట్రాక్టర్ యజమానులు బహిరంగంగా ఒప్పుకుంటున్నారు.

తీగల వాగు, బొగ్గుల వాగు, అన్‌సాన్‌పల్లి వాగు, పెద్దవాగు, గద్దెకుంట వాగుల నుంచి ట్రాక్టర్ల ద్వారా ఇసుకను అక్రమంగా తరలిస్తుండగా అటవీ శాఖ అధికారులు పట్టుకొని వదిలేసిన దాఖలాలు అనేకమున్నాయి. గతంలో రెవెన్యూ శాఖకు చెందిన అధికారులు, సిబ్బంది కొందరు ఇసుక ట్రాక్టర్లను, జేసీబీలను కార్యాలయానికి తీసుకువచ్చి వదిలేసిన సందర్భాలు సైతం ఉన్నాయి. అధికారుల అండదండలు లేకపోతే ఇసుక దందా ఇంత పెద్ద మొత్తంలో కొనసాగేది కాదని పలువురు బాహాటంగా విమర్శిస్తున్నారు.

81

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles