హరితహారం మొక్కలను సంరక్షించాలి


Wed,December 4, 2019 03:10 AM

-శ్మశానవాటికలు, డంపింగ్ యార్డులు పూర్తి చేయాలి
-కొత్త నర్సరీలు ఏర్పాటు చేయాలి: జెడ్పీ సీఈవో శిరీష
భూపాలపల్లి టౌన్, డిసెంబర్03: హరితహారం కార్యక్రమంలో నాటిన మొక్కలను సంరక్షించాలని జయశంకర్ భూపాలపల్లి జెడ్పీ సీఈవో శిరీష అన్నారు. మంగళవారం జెడ్పీ కార్యాలయంలో జిల్లాలోని పదకొండు మండలాల ఎంపీడీవోలతో సమీక్ష, సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలాల వారీగా బడ్జెట్ ప్రతిపాదన రూపొందించి పంపాలని కోరారు.


దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని వారం రోజుల్లో మండలాల్లో వేడుకలు నిర్వహించుకోవాలని చెప్పారు. హరితహారం కార్యక్రమంలో నాటిన మొక్కలకు నీరు అందిచి కాపాడాలని పేర్కొన్నారు. ఆయా గ్రామాల్లో పెండింగ్‌లో ఉన్న మరుగుదొడ్ల నిర్మాణాలను వెంటనే పూర్తి చేయించాలని ఆదేశించారు.

పల్లెప్రగతి కింద ఆయా మండలాల్లో శ్మశానవాటికలు, డంపింగ్ యార్డులు, ఇంకుడు గుంతలు, కొత్త నర్సరీల పనులను ప్రారంభించాలని వివరించారు. హరితహారంకింద మండలాల్లో నాటిన మొక్కలను పర్యవేక్షించి చనిపోయిన మొక్కల స్థానాల్లో కొత్త మొక్కలు నాటించాలని సూచించారు. ఎంపీడీవో, ఏపీవో, ఎంపీవో, ఈసీలు కమిటీగా ఏర్పడి ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని తెలిపారు. అదేవిధంగా మండలాల వారీగా జీవ వైవిధ్య కమిటీలు వేసుకోవాలని, ప్రకృతి పరంగా లభించే అనేక ఔషధ జాతి మొక్కలను సంరక్షించుకోవాలని పేర్కొనారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీవో సుమతి, ఏపీవో కుమారస్వామి మండలాల ఎంపీడీవోలు పాల్గొన్నారు.

53

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles