ట్రాక్టర్ల కొనుగోలు పూర్తి చేయాలి


Wed,December 4, 2019 03:09 AM

-నర్సరీలకు స్థలాలు గుర్తించాలి
-వీడియో కాన్ఫరెన్స్‌లో పంచాయతీరాజ్ కమిషనర్ రఘునందన్‌రావుకలెక్టరేట్, డిసెంబర్ 3: గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్ల కొనుగోలు ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కమిషనర్ రఘునందన్ రావు అధికారులను ఆదేశించారు. పల్లె ప్రగతి, తెలంగాణకు హరితహారం, ట్రాక్టర్ల కొనుగోలు ప్రక్రియపై మంగళవారం వీడియో కాన్ఫన్స్ ద్వారా సమీక్షించారు. పల్లెవూపగతి కార్యక్షికమంలో భాగంగా చేపట్టి, పూర్తి కాని పనులను త్వరగా పూర్తిచేయాలన్నారు.

హరితహారం కోసం నర్సరీలకు స్థలాలు గుర్తించాలని, ఇప్పటికే నాటిన మొక్కలు ఏపుగా పెరగడానికి ఏర్పాట్లు చేయాలని, నాటిన మొక్కలు ఎక్కడైనా ఏనుకోకపోతే వాటి స్థలంలో కొత్త మొక్కలు నాటాలని సూచించారు. పల్లెలు, పట్టణాలు పచ్చదనంతో కళకళలాడేలా చర్యలు చే పట్టాలని ఆదేశించారు. గ్రామ పంచాయతీల్లో వివిధ అవసరాలకు ట్రాక్టర్లను త్వరగా కొనుగోలు చేయాలని ఆదేశించారు. వీడియో కాన్ఫన్స్‌లో డీఆర్డీవో సుమతి, జెడ్పీసీఈవో శిరీష, డీఎల్‌పీవో, వెంక శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

59

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles