పున్నమి వెలుగులు!


Wed,November 13, 2019 03:02 AM

-కాళేశ్వరం/ వెంకటాపూర్‌/ గణపురం : కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు జిల్లాలోని ఆలయాలు మంగళవారం దేదీప్యమానంగా వెలిగిపోయాయి. ఆకాశంలో నిండు పున్నమి, కార్తీక దీపాల వెలుగులో కాంతులీనాయి. భక్తులు ప్రాతఃకాలంలో లేచి స్నానాలు చేశారు. తులసి చెట్ల చుట్టూ ప్రదక్షిణలు నిర్వహించి, ఉసిరిక దీపాలు వెలిగించారు. హరిహరులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అభిషేకాలు జరిపారు. భక్తిశ్రద్ధలతో సత్యనారాయణస్వామి, కేదారీశ్వరస్వామి వ్రతాలు చేపట్టారు. ఉపవాసాలు ఉన్నారు. భక్తుల రాకతో గోదావరి తీర ప్రాంతాలు పులకించాయి. రెండు జిల్లాల్లో ఆలయాలు శివనామస్మరణతో మార్మోగాయి. అన్ని గ్రామాల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకున్నది.


కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయానికి వివిధ రాష్ర్టాలు, జిల్లాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. గోదావరిలో కార్తీక స్నానాలు చేసి, నదీమతల్లికి హారతి ఇచ్చి, దీపాలు వదిలారు. సైకత లింగాలకు పూజలు చేశారు. అర్చకులు ఉదయం 5 గంటలకు గోదావరి నదికి వెళ్లి ఐదు కలశాలలో నీరు తె చ్చి స్వామి వారికి అభిషేకం నిర్వహించారు. కుంకుమార్చన జరిపించారు. మధ్యాహ్నం 12 గంటలకు శివ కల్యాణాన్ని వైభవోపేతంగా జరిపించారు. సు బ్రహ్మణ్య స్వామి ఆలయంలో కాల సర్పదోష నివారణ పూజలు నిర్వహించారు. సాయంత్రం 4 గంటలకు 40 మంది భక్తులు సత్యనారాయణ వ్రతాలు నిర్వహించారు. ఉసిరి, మారేడు చెట్టు వద్ద మహిళలు లక్ష వొత్తులు వెలిగించారు. ముగ్గు వేసి దీపాలు అలంకరించారు. పంచరత్నాల్లో భాగంగా గోదావరికి హారతి ఇచ్చారు. స్వామివారికి వివిధ పూజలు, అభిషేకాలు, టికెట్ల రూపంలో రూ.4.51,350 ల క్షల ఆదాయం సమకూరినట్లు ఈవో మారుతి తెలిపారు. కాగా, కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంపై నిండు జాబిలి కనువిందు చేసింది. రాజగోపురం, ప్రధాన ఆలయం నుంచి చందమామను చూస్తూ భక్తులు మురిసిపోయారు. పూజా కార్యక్రమాల్లో జేసీ స్వర్ణలత, డీఎస్పీ కిషన్‌, చైర్మన్‌ వెంకటేశం, ఈవో మారుతి, ధర్మకర్తలు రాంనారాయణ గౌడ్‌, ఓగేశ్‌, సంజీవరెడ్డి, సర్పంచ్‌ వసంత, ఎంపీటీసీ మమత తదితరులు పాల్గొన్నారు.

రామప్పకు పోటెత్తిన భక్తులు
రామప్ప దేవాలయానికి భక్తులు ఉదయం 4 గంటల నుంచే తరలివచ్చి రామలింగేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీపాలు వెలిగించి, పసుపు, కుంకుమ, పాలు, పెరుగు, నెయ్యి, పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. కల్యాణ మండపం, నందీశ్వరుడి వద్ద యువతులు దీపాలు వెలిగించారు. పూజారులు హరీశ్‌శర్మ, ఉమాశంకర్‌ భక్తులకు తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు.

కోటగుళ్లలో..
గణపురం మండలం కోటగుళ్లలో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి, భోళాశంకరుడిని దర్శించుకున్నారు. కోటగుళ్ల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో సహస్ర దీపారాధన నిర్వహించారు. రెడ్డిగుళ్లు, బు ద్దారం, చెల్పూర్‌, కేటీపీపీ తదితర ఆలయాల్లో పూ జలు కొనసాగాయి. కోటగుళ్లలో రూరల్‌ జెడ్పీ చైర్‌పర్సన్‌ గండ్ర జ్యోతి, భూపాలపల్లి ఏఎస్పీ శ్రీనివాసులు, ములగు ఏఎస్పీ సా యి చైతన్య, భూపాలపల్లి డీ ఎస్పీ సంపత్‌రావు, ఎంజీఎం అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ నవీన్‌ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

70

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles