కాళేశ్వరంలో చొప్పదండి ఎమ్మెల్యే పూజలు


Tue,November 12, 2019 02:19 AM

కాళేశ్వరం, నవంబర్ 11: కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవి శంకర్ కుటుంబ సమేతంగా సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక సోమవారాన్ని పురస్కరించుకొని ఆయన కాళేశ్వరం వచ్చారు. గోదావరిలో స్నానాలు చేసి నదీమతల్లికి పూజలు చేసి, దీపాలు వదిలారు. అనంతరం ఆలయానికి చేరుకోగా ఈవో మారుతి, అర్చకులు మార్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. స్వామి వారి సన్నిధిలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవారి కల్యాణ మండపంలో ఆశీర్వదించారు. స్వామి వారి శేష వస్ర్తాలతో సన్మానించారు.


హరిత హోటల్ ఆవరణంలో ఎమ్మెల్యే మాట్లాడారు. తాను ఎస్సీ సెల్ చైర్మన్‌గా ఉన్న సమయంలో కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకున్నానని, ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత స్వామివార్ల ఆశీస్సులు పొందేందుకు వచ్చినట్లు తెలిపారు. కాళేశ్వరం ఆలయం దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్నదని కొనియాడారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత వేల కోట్ల రూపాయలతో ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారని, లక్షలాది మంది రైతులకు కాళేశ్వరం ఫలాలు త్వరలోనే అందుతాయన్నారు. సీఎం కేసీఆర్ రైతులను రాజులను చేసే ఘట్టం ఆవిష్కృతం కాబోతున్నదని చెప్పారు. వారి వెంట ఆలయ ధర్మకర్తలు గంటా రాంనారాయణ గౌడ్, కొండ్ర ఓగేశ్, సంజీవరెడ్డి తదితరులున్నారు.

44

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles