ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలి


Tue,November 12, 2019 02:19 AM

ములుగుజిల్లా ప్రతినిధి/నమస్తే తెలంగాణ: జిల్లాలో నెలకొన్న ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి కూతాటి రమాదేవి సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వివిధ సమస్యలపై ప్రజల నుంచి 30 వినతులు అందినట్లు తెలిపారు. ఆయా ఫిర్యాదులను సంబంధిత శాఖలకు పంపించారు. సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆదేశాలను జారీ చేశారు. జిల్లాలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నియంత్రణకు అధికారులు, ఉద్యోగులు సమష్టి కృషి చేయాలని కోరారు. కార్యాలయాల్లో ప్లాస్టిక్‌ను నిషేధించారు.ప్లాస్టిక్ వాటర్ బాటిళ్ల స్థానంలో స్టీల్, కాపర్ బాటిళ్లు వాడాలన్నారు. మేడారం జాతరను ప్లాస్టిక్ రహితంగా నిర్వహించేలా అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు.

38

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles