గుడుంబా స్థావరాలపై దాడులు


Mon,November 11, 2019 01:15 AM

మహాముత్తారం, నవంబర్10: గుండుంబ స్థావరాలపై పోలీసులు సిబ్బందితో కలిసి ఆదివారం దాడులు చేశారు. వివరాలు.. మండలంలోని ప్రేమ్‌నగర్, మినాజిపేట గ్రామాల అ డవిలోని వాగులో గుడుంబా తయా రు చేస్తున్న స్థావరాలపై కాటారం సీఐ హథిరాం, మహాముత్తారం ఎస్సై చ ల్లా రాజు దాడులు చేసి ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మహాముత్తారం ఎస్సై చల్లా రాజు మాట్లాడుతూ మినాజిపేట, ప్రేమ్‌నగర్ గ్రామాల మధ్యలోని వాగులో తనిఖీలు చేశామన్నారు. ప్రేమ్‌నగర్ గ్రామానికి చెందిన జాటోత్ రాము నాయక్ గుడుంబను తయారు చేస్తు పట్టుబడ్డాడన్నారు. అతని వద్ద 1500లీటర్ల బెల్లం పానకం, 12లీటర్ల గుడుంబా లభ్యమైందన్నారు. అనంతరం పట్టుబడిన బెల్లం పానకాన్ని ద్వంసం చేసి, నిందితుడిపై కేసు నమోదు చేశామని మహాముత్తారం ఎస్సై రాజు చెప్పారు. కార్యక్రమంలో సీఆర్పీఎఫ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

36

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles