మేడారంలోభక్తుల సందడి


Mon,November 11, 2019 01:14 AM

తాడ్వాయి, నవంబర్ 10 : ఆదివాసీ గిరిజన దైవాలైన మేడారం సమ్మక్క-సారలమ్మలను దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆదివారం సెలువు దినం కావడంతో తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచే కాకుండా పక్క రాష్ర్టాలు అయిన ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్రల నుంచి భక్తులు ప్రైవేట్ వాహనాల్లో మేడారానికి తరలివచ్చారు. ముందుగా జంపన్నవాగులో పుణ్య సాన్నాలు ఆచరించి వాగు ఒడ్డున గల జంపన్నగద్దెకు పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవార్ల గద్దెల వద్దకు చేరుకొని గిరిజన సంప్రదాయ పద్ధతిలో అమ్మవార్ల గద్దెలపై పసుపు, కుంకుమ, ఎత్తు బెల్లం, నూతన వస్ర్తాలు, పూలు, పండ్లు సమర్పించి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకుంటున్నారు. తల్లుల మొక్కులకు అనుగుణంగా యాటపోతులు, కోళ్లను సమర్పించారు. అనంతరం జాతర పరిసరాల్లోని చెట్ల కింద వంటలు చేసుకొని విందు భోజనాలు చేశారు.

29

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles