బొగత అందాలు అద్భుతం


Sat,November 9, 2019 05:59 AM

వాజేడు, నవంబర్ 8: చీకుపల్లి అటవీ ప్రాంతంలోని బొగత జలపాతం అందాలు అద్భుతంగా ఉన్నాయని శిక్షణ ఎఫ్‌ఆర్వోలు మహేశ్వరరావు, స్వర్ణలత పేర్కొన్నారు. ఆయా ప్రాంతాలను వారు శుక్రవారం సందర్శించారు. జలపాతం పరిసరాలు పరిశీలించారు. ఇక్కడ టూరిజం ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఎఫ్‌ఆర్వో డోలి శంకర్‌ను అడిగి తెలుసుకున్నారు. జలపాతం చుట్టూ ఉన్న పగోడలు, చిల్డ్రెన్స్‌పార్క్, బట్టర్‌ైైఫ్లె పార్క్, అడవులను పరిశీలించారు. జలపాతం అందాలు బాగున్నాయని చెప్పారు. వెంట సెక్షన్ ఆఫీసర్ చిన్నక్క, సిబ్బంది ఉన్నారు.

49

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles