రేపు జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు


Thu,November 7, 2019 02:17 AM

ములుగు, నమస్తే తెలంగాణ: ములుగు జిల్లా ప్రజాపరిషత్ ఏడు స్థాయీ సంఘ సమావేశాలను శుక్రవారం నిర్వహించనున్నట్లు జెడ్పీసీఈవో పారిజాతం బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయంలో స్థాయీ సంఘ సమావేశాలు నిర్వహించనున్నట్లు ఆమె పేర్కొన్నారు. గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, సాంఘీక సంక్షేమం, విద్యా, వైద్య సేవలు, స్త్రీ సంక్షేమం, అభివృద్ధి పనుల సమావేశాలను నిర్వహిస్తున్నట్లు ఆ ప్రకటనలో వివరించారు. సంబంధిత జిల్లా స్థాయి అధికారులు వారి శాఖలకు సంబంధించిన సవివరమైన ప్రగతి నివేదికలతో సమావేశానికి హాజరు కావాలని సూచించారు.

33

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles