జోగినపల్లి గ్రీన్ చాలెంజ్‌ను స్వీకరించిన కలెక్టర్


Thu,November 7, 2019 02:17 AM

జయశంకర్ భూపాలపల్లి కలెక్టరేట్, నవంబర్ 6: ఎంపీ జోగినపల్లి సంతోశ్‌కుమార్ విసిరిన గ్రీన్ చాలెంజ్ రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా కొనసాగుతోంది. సంగారెడ్డి కలెక్టర్ హనుమంతరావు విసిరిన చాలెంజ్‌ను కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు స్వీకరించారు. జిల్లా కేంద్రంలోని తన అధికారిక నివాసంలో బుధవారం 6 మొ క్కలు నాటారు. ఇందులో జామ, కబంద, పనస, మారేడు, ఉసి రి, సపోట మొక్కలు ఉన్నాయి. అనంతరం తన స్నేహితులైన మ హబూబ్‌నగర్ కలెక్టర్ రొనాల్డ్‌రాస్, భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి, హాస్యనటుడు శివారెడ్డికి కలెక్టర్ గ్రీన్ చాలెంజ్ విసిరారు. అనంతరం మాట్లాడుతూ సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. గ్రీన్ చాలెంజ్‌ను ప్రారంభించిన ఎంపీ జోగినపల్లి సంతోశ్‌కుమార్‌కు కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు.

31

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles