సమస్యలు లేని తెలంగాణే కేసీఆర్‌ లక్ష్యం


Wed,November 6, 2019 02:26 AM

టేకుమట్ల, నవంబర్‌ 05 : గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రజా సంక్షేమమే ధ్యే యంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, రా ష్ర్టాన్ని సమస్యలు లేని తెలంగాణగా మార్చడమే సీఎం కేసీఆర్‌ లక్ష్యమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. మండంలోని పలు గ్రామాల్లో మంగళవారం ఆయన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ని సజీవదహనం చేయడం దారుణమని, తమ పిల్లలకు తల్లిని దూరం చేసిన నిందితుడిని ప్రజల మధ్యలో ఉరితీయాలన్నారు. అనంతరం ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని 2నిమిషాలు మౌనం పాటించారు. ఈ మేరకు మండలంలోని బండపల్లికి రూ. 25లక్షలతో మంజూరైన సీసీరోడ్డు, డ్రైనేజీ పనులకు, గుమ్మడవెల్లి గ్రామంలో రూ.10లక్షలతో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు, ద్వారకపేట నుంచి కుందనపల్లి వరకు రూ.కోటి 80లక్షలతో రోడ్డు పనులకు, బూర్నపల్లిలో రూ.10లక్షలతో శ్మశానవాటిక నిర్మాణ పనులకు, వెలిశాల నుంచి రాఘవాపూర్‌ వరకు రూ.2కోట్ల 70లక్షలతో బీటీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పెద్దంపల్లి గ్రామస్తులు తమ ఊరికి సరైన దారి లేదని పిల్లలు పాఠశాలకు వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వెలిశాల నుంచి రాఘవాపూర్‌ గుట్టకు వెళ్లే దారిని పెద్దంపల్లికి మళ్లించాలని విజ్ఞప్తి చేశారు. స్పందించిన ఎమ్మెల్యే వెలిశాల నుంచి రాఘవాపూర్‌కు డబుల్‌ రోడ్డు ఉన్న నేపథ్యంలో పెద్దంపల్లి ప్రజలకు అత్యవసరం ఉన్నందున ఈ రోడ్డు వెలిశాల నుంచి పెద్దంపల్లికి పోయాలని డీఈ ఆత్మారాముకు సూచించారు. దీంతో పెద్దంపల్లి గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయనను సన్మానించి కృజ్ఞతలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ తన సొంత అనుభవంతో, ప్రజల సమస్యలపై అవగాహనతో ఒక్కో సంక్షేమ పథకాన్ని ప్రవేశపెట్టి తెలంగాణ అభివృద్ధికి కృషి చేస్తున్నారని అన్నారు. టేకుమట్లకు చలివాగు, మానేరు వాగులు ఉండటం ఈ ప్రాంత ప్రజలు, రైతుల అదృష్టమని, వాటిపై చెక్‌ డ్యాంల నిర్మాణానికి ప్రణాళికలు జరుగుతున్నట్లు తెలిపారు. ఇవి పూర్తి అయితే టేకుమట్ల రైతులు రెండు పంటలు తీసుకునే అవకాశం ఉంటుందన్నారు. టేకుమట్లలోని చలివాగు, మానేరు వాగులను నుంచి ఇతర ప్రాంతాలకు ఇసుకను తరలించకుండా ఆ వాగుల పరివాహక ప్రాంతాల గ్రామస్తులు, రైతులు నియంత్రించాలని ఎమ్మెల్యే సూచించారు.


మృతుల కుటుంబాలకు పరామర్శ..
మండలంలోని రాగవరెడ్డిపేటకు చెందిన వంగ మొగిలి, టేకుమట్లకు చెందిన దుబాల రాజనర్సులు మృతి చెందగా మృతుల కుటుంబాలను ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి పరామర్శించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ పులి తిరుపతిరెడ్డి, ఎంపీపీ మల్లారెడ్డి, వైస్‌ఎంపీపీ పోతనవేణి ఐలయ్యయాదవ్‌, ఎంపీడీవో చండీరాణి, డీఈ ఆత్మారాం, ఏవో శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచ్‌లు ఆకినపల్లి సంధ్య, చింతలపల్లి విజయ, బుచ్చయ్య, మొండయ్య, రాజేందర్‌, వెంకటేశ్వర్‌రెడ్డి, సరోత్తంరెడ్డి, కత్తి సంపత్‌, ఆది రఘు, ఉమేందర్‌రావు, బందెల నరేశ్‌, సురేందర్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి, కృష్ణారెడ్డి, నరేందర్‌రెడ్డి, శ్రీను, మహేశ్‌, కమ్రోద్దీన్‌ తదితరులు పాల్గొన్నారు.

41

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles