నిరసనల హోరు


Tue,November 5, 2019 04:05 AM

-తహసీల్దార్‌ను సజీవ దహనం చేసిన ఘటనపై రెవెన్యూ సిబ్బంది ఆగ్రహం
-నల్లబ్యాడ్జిలు ధరించి విధుల బహిష్కరణ


భూపాలపల్లి నమస్తే తెలంగాణ : రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయారెడ్డి సజీవ దహన ఘటనను ఖండిస్తూ సోమవారం సాయంత్రం భూపాలపల్లి రెవెన్యూ అధికారులు, సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. డిప్యూటీ తహసీల్దార్ సూర్యనారాయణ మాట్లాడుతూ.. కార్యాలయంలో విధులు నిర్వహిసున్న తహసీల్దార్ విజయారెడ్డిపై దుండగుడు పెట్రోల్ పోసి నిప్పంటి సజీవ దహనం చేశాడన్నారు. ఈ ఘటనను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని, ఆమె ఆత్మకు శాంతి చేకురాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నామన్నారు. ఈ ఘటనకు బాధ్యలైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. నిరసన కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది, వీఆర్వోలు, వీఆర్‌ఏలు తదితరులు పాల్గొన్నారు.

మల్హర్‌లో..
మల్హర్ : రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ విజయారెడ్డిపై ఓ వ్యక్తి పెట్రోలు పోసి సజీవ దహనం చేసిన ఘటనను మండల రెవెన్యూ సిబ్బంది తీవ్రంగా పరిగణించారు. సోమవారం తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ దత్తు ప్రసాద్‌తోపాటు సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. రెవెన్యూ అధికారులపై భౌతిక దాడులు పెరుగుతున్న ఘటనలు తీవ్ర మనస్తాపానికి గురి చేస్తున్నాయన్నారు. కార్యక్రమంలో వీఆర్వో లు తిరుపతి, మల్లేశ్, ఆర్‌ఐ సరిత, సిబ్బంది పాల్గొన్నారు.

గణపురంలో..
గణపురం : హైదరాబాద్ నగర శివారు అబ్దుల్లాపూర్‌మెట్ ఘటనను మండలంలోని రెవెన్యూ సిబ్బంది తీవ్రంగా ఖండించారు. దాడికి పాల్పడిన నిందితుడు సురేశ్‌ను కఠినంగా శిక్షించాలంటూ నల్ల బ్యాడ్జీలను ధరించి తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైటాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా తహసీల్దార్ దేవుళ్లపెల్లి సమ్మయ్య మాట్లాడుతూ.. అబ్ధుల్లాపూర్‌మెట్ తహసీల్థార్ విజాయారెడ్డిపై పెట్రోల్‌తో దాడిచేసి హత్య చేయడం దారుణమని అన్నారు. ప్రభుత్వం వెంటనే రెవెన్యూ ఉద్యోగుల రక్షణ కోసం ప్రత్యేక చట్టాలను తీసుకురావాలన్నారు. ఇలాంటి ఘటనలు పురావృతంగా కాకుండా తక్షణమే దాడికి పాల్పడ్డ నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరారు. ఈకార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ సత్యనారాణ, ఆర్‌ఐ పిట్టల సాంబయ్య, సర్వేయర్ శిరీష, వీఆర్వోలు మొగిళి, కుమార్ తదితరులు పాల్గొన్నారు.

టేకుమట్లలో..
టేకుమట్ల : తహసీల్దార్ విజయారెడ్డిని పెట్రోల్ పోసి సజీవ దహనం చేయడం చాలా దారుణమని తహసీల్దార్ నరేశ్ అన్నారు. ఈ దాడిని ఖండిస్తూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట రెవెన్యూ సిబ్బందితో కలిసి ఆయన నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐ అచ్చారావు, సీనియర్ అసిస్టెండ్ విజయ్, వీర్వోలు, వీఆర్‌ఏలు జితేందర్, రవీందర్, స్వామి, పృథ్వి, పైడి, రాజు, సందీప్, సురేశ్, రమేశ్, కొమురయ్య, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.

చిట్యాలలో..
చిట్యాల : తహసీల్దార్ విజయారెడ్డి సజీవ దహనం ఘటనను ఖండిస్తూ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట రెవెన్యూ ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ ఎమ్డీ షరీఫ్ మాట్లాడుతూ.. ఓ ప్రభుత్వ ఉన్నతాధికారిపై దుండగుడు కూర సురేశ్ దాడి చేయడం దారుణమన్నారు. వెంటనే నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరారు. ఈకార్యక్రమంలో ఆర్‌ఐ హంస నరేందర్, సీనియర్ అసిస్టెంట్ రాజేందర్, వీఆర్వోలు తదితర సిబ్బంది పాల్గొన్నారు.

రేగొండలో..
రేగొండ : మండలంలోని రెవెన్యూ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. దోషులను శిక్షించి తమకు రక్షణ కల్పించాలని కోరారు. ఈకార్యక్రమంలో రవీందర్, సందీప్, రాజయ్య, లింగముర్తి తదితరులు పాల్గొన్నారు.

కాటారంలో..
కాటారం : రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయారెడ్డిని దుండగుడు పెట్రోల్ పోసి సజీవ దహనం చేయడంపై స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట రెవెన్యూ ఉద్యోగులు, వీఆర్వోలు సోమవారం నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, తహసీల్దార్ విజయ కుటుంబానికి తగిన న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ ప్రదీప్, ఆర్‌ఐ భాస్కర్, జూనియర్ అసిస్టెంట్ దామోదర్, వీఆర్వోలు బండి శ్రీనివాస్, షఫీ, నక్క రాజయ్య, వెంకటయ్య, సమ్మయ్య, వీఆర్‌ఏలు జితేందర్, శ్రీనివాస్, శారద, సతీశ్ తదితరులు పాల్గొన్నారు.

50

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles