గోమూత్రంలో ఔషధ తయారీపై నేడు రైతులకు శిక్షణ తరగతులు


Tue,November 5, 2019 04:03 AM

మంజూర్‌నగర్, నవంబర్ 04 : గోమూత్రంతో ఔషధ తయారీపై రైతులకు నేడు తేజస్విని గాంధీ జూనియర్ కళాశాలలో ఉదయం తొమ్మిది గంటలకు శిక్షణ శిబిరాన్ని నిర్వహించనున్నట్లు బ్రహ్మకుమారి చైతన్య సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. గోవు ద్వారా లభించే పంచ గవ్వములతో (మూత్రం, పేడ, పాలు పెరుగు, నెయ్యి) ఔషధ తయారీ విధానాన్ని రైతులకు తెలియజేసేందుకు విజయవాడకు చెందిన పోకూరి బాలకృష్ణ ముఖ్యఅతిథిగా హజరై శిక్షణ ఇవ్వనున్నారని తెలిపారు. గోసంరక్షణ చేసి పంచ గవ్వములతో క్యాన్సర్,బీపీ, డయాబెటిస్, చర్మ వ్యాధుల నివారణకు ఈ మందుల తయారు చేయడానికి ఈ శిక్షణ శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నేడు (బుధవారం పరకాల పట్టణంలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రజలు, రైతులు అధికారులు అధిక సంఖ్యలో పాల్గొని శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

49

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles