ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్‌లో అనురాధకు డాక్టరేట్


Tue,November 5, 2019 04:02 AM

గోవిందరావుపేట : మండలంలోని చల్వాయి గ్రామానికి చెందిన పాములపాటి అనురాధ సోమవారం డాక్టరేట్ పట్టా అందుకుంది. గ్రామానికి చెందిన అనురాధ ఉమ్మడి వరంగల్ జిల్లా హసన్‌పర్తి మండలంలోని ఎస్ ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో ఈసీఈ విభాగంలో లెక్చరర్‌గా పని చేస్తుంది. వర్క్‌లోడ్ క్యారక్టరైజేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ మాడలింగ్ ఫర్ మల్టిఫోర్ సిస్టమ్స్ అనే అంశంపై సమర్పించిన గ్రంథానికి గానూ జేఎన్‌టీయూ అనురాధకు పీహెచ్‌డీ ప్రకటించింది. ఆమెకు డాక్టరేట్, ప్రశంసా పత్రాన్ని జెఎన్‌టీయూ ప్రొఫెసర్ డాక్టర్ నర్సింహ, ఓయూ ప్రొఫెసర్ పర్యవేక్షణలో ప్రకటన చేసి డాక్టరేట్‌ను ప్రకటించారు. చల్వాయిలో జన్మించిన అనురాధ హన్మకొండలోని పద్మాక్షి కాలనీలో నివాసముంటుంది. అనురాధ డాక్టరేట్ సాధించడంపై ఆమె భర్త రామకృష్ణ, కుటుంబ సభ్యులు విజయ్‌కుమార్, వేణుగోపాల్, కిషోర్‌బాబు, ఉదయ్, నరేశ్, చల్వాయి ఉప సర్పంచ్ హరిప్రసాద్ గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.

38

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles