ఏనుమాములలో తెల్లబంగారం


Tue,November 5, 2019 04:02 AM

కాశీబుగ్గ, నవంబర్04: వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ సోమవారం తెల్లబంగారంతో కళకళలాడింది. ఈ సంవత్సరం పత్తి సీజన్ అక్టోబర్ నుంచి ప్రారంభం కాగా అత్యధికంగా సోమవారం 20,116 బస్తాల పత్తి మార్కెట్‌కు వచ్చింది. గత సంవత్సరంతో పొల్చుకుంటే పత్తి రాబడి చాలా వరకు తగ్గింది. అక్టోబర్ నుంచి పత్తి సీజన్ ప్రారంభం కాగా నవంబర్ మాసంలో ప్రతి రోజు మార్కెట్‌కు కనిష్ఠంగా 30వేల బస్తాలు అత్యధికంగా లక్షకు పైగా పత్తి బస్తాలు వచ్చేవి. కానీ ఇప్పటి వరకు మార్కెట్‌కు రోజు పది వేల వరకు పత్తి బస్తాలు వస్తున్నాయి. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు మార్కెట్‌కు 1.58లక్షల క్వింటాళ్ల పత్తి (3లక్షల బస్తాలు) వచ్చినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు.


గత సంవత్సరం సీజన్ మొత్తం మార్కెట్‌కు 9,55,153(20 లక్షల బస్తాలు) రాగా నవంబర్ 5వ తేదీ వరకు 2లక్షల19క్వింటాళ్ల (4లక్షల 40వెయ్యిల బస్తాలు) పత్తి వచ్చినట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వ మద్దతు ధర క్వింటాల్‌కు రూ.5550 ఉండగా తేమ అధికంగా ఉండడం వలన తక్కువ ధరలకే వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. ఇటీవల వరుసగా వర్షాలు కురవడంతో పత్తి పూర్తిగా తడిసిపోయింది. అలాగే పత్తి కాయలు, చెట్లు నీటిలో నాని పూర్తిగా మురిగిపోతున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో పత్తి నా ణ్యత చాలా వరకు దెబ్బతింటుందని వ్యాపారులు అంటున్నారు. నాణ్యతగల పత్తి వస్తేనే గిట్టుబాటు ధర లభించే అవకాశం ఉందని అంటున్నారు.

33

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles