మంత్రులకు టీఆర్‌ఎస్ నాయకుల సన్మానం


Tue,November 5, 2019 04:02 AM

వాజేడు,నవంబర్ 04 : రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును, గిరిజన , శిశుసంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ను హైదరాబాద్‌లో సోమవారం నూగూరు ఏఎంసీ చైర్మన్ బోదెబోయిన బుచ్చయ్య, టీఆర్‌ఎస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలసి శాలువాకప్పి సన్మానించారు. మండలంలో ఉన్న సమస్యల పరిష్కారానికి కృషిచేయాలని కోరారు. ఈ నెల 8తేదీన హన్మకొండలో జరిగే తమ కూతురు వివాహానికి హాజరు కావాలని ఖమ్మం డీసీఎంఎస్ చైర్మన్ యగ్గడి అంజయ్య మంత్రులకు పెండ్లి పత్రిక ఇచ్చి మర్యాద ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు పెనుమల్లు రామకృష్ణారెడ్డి, మండల అధికార ప్రతినిధి చెన్నం ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

36

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles