మెరిసిన సాంకేతిక తారలు


Mon,November 4, 2019 02:45 AM

-జోష్ నింపిన టెక్నో విజన్
-మరిచిపోలేని క్షణాలు అంటున్న విద్యార్థులు
-టెక్నోజియాన్-19కు బైబై


నిట్‌క్యాంపస్,నవంబర్ 03 : అద్భుతమైన ఆవిష్కరణలు.. ఆకాశాన్నంటే సంబురాలు.. సాంకేతికవిద్యలో ప్రతిభను చూపే అవకాశాలను అందిపుచ్చుకునే వేదికపై సృజనాత్మకతను ప్రదర్శించారు. టెక్నోజియాన్-19 వేదికగా వరంగల్‌లోని నిట్‌లో నిర్వహించిన 55 ఈవెంట్‌లు, ఆరు వర్క్‌షాప్‌లలో విద్యార్థుల భాగస్వాములై విజయవంతం చేశారు. ఇంటర్‌నెట్ ఆఫ్ థింగ్స్, మ్యాటర్స్ కేఫ్, మెక్ ఎలక్ట్రిక్, ఎథికల్ హ్యాకింగ్, బెయిన్ ఒకాస్టర్, ఎలక్ట్రిఫై, ఎలక్ట్రోవిన్, వార్ ఆఫ్ విజార్డ్, టెక్నోషాట్, డెత్‌నోట్, మ్యాథమెటికల్ తంబోలా, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, ద త్రీ మస్కటీయర్స్, గేమ్‌డోమ్, నియాన్ క్రికెట్, క్రియేటివ్ రోబో, రోబో వార్స్, సైబర్ సెక్యూరిటీ, ధ్రస్ట్, కౌన్ బనేగా కరోడ్‌పతి, ఏవియాన్ వంటి ఈ వెంట్లు విజయవంతంగా జరిగాయి. సాంకేతిక భాషలో తేడాలున్నా టెక్ విద్యార్థులకు విషయపరిజ్ఞానం అందించే ఈవెంట్‌లే అని కోర్‌టీమ్ విద్యార్ధి నాయకులు అంటున్నారు. ఇంజినీర్లుగా మారే విద్యార్థులకు టెక్నోజియాన్ అద్భుతమైన ముందడుగు. మూడు రోజుల పాటు సాంకేతిక పండుగతో ఎంజాయ్ చేసి వీడ్కోలు తెలిపారు.

నోవస్ లక్ష్యలపై గురి....
నోవస్ అంటే నూతన ఆవిష్కరణలకు నాంది పలకడం. ఈ రోజుల్లో యువతరం ఉద్యోగాలు చేయడం కంటే పరిశోధనలు, స్టార్టప్‌లపైనే ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. ప్రత్యేకించి నిట్‌లో ఇన్నోవేషన్ గ్యారేజీ ద్వారా కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహిస్తున్నామని డైరక్టర్ ఎన్వీ రమణారావు తెలిపారు. ఈసారి థీమ్‌గా నోవస్‌ను ప్రత్యేకంగా ఎంచుకుని మూడు రోజుల పాటు ఈవెంట్లు నిర్వహించామని కోర్‌టీమ్ కోఆర్డినేటర్ నిఖిల్ చౌదరి తెలిపారు. భవిష్యత్‌లో నోవస్ ఫలితాలు రావాలని ఆకాంక్షిస్తున్నట్లు విద్యార్థులు తెలిపారు.

45

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles