కాళేశ్వరంలో కార్తీక సందడి


Mon,November 4, 2019 02:43 AM

కాళేశ్వరం, నవంబర్ 03 : కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారి ఆలయంలో ఆదివారం కార్తీక మాసం సందర్భంగా భక్తుల రద్దీ పెరిగింది. రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా మహారాష్ట్ర, ఛత్తీష్‌గఢ్ రాష్ర్టాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. ముందుగా త్రివేణి సంగమ గోదావరి తీరంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. ఈ సందర్భంగా మహిళలు కార్తీక దీపాలు గోదావరిలో వదిలి సైకత లింగాల కు పూజలు చేశారు. అనంతరం ఆలయానికి చేరిన భక్తులు కొందరు సుబ్రహమణ్య స్వామి వారి ఆల య ఆవరణలో కాలసర్ప దోష నివారణ పూజలు చేశారు. అనంతరం కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో అర్చకులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి నుంచి శుభనందదేవి (పార్వతీ అమ్మవారు)ఆలయానికి చేరుకున్నారు. అక్కడ కుంకుమార్చన పూజలు చేశారు. కార్తీక మాసం సందర్భంగా ఆలయంలోని తులసి చెట్టుకు పూజలు చేసి, ఉసరి చెట్టు వద్ద కార్తీక దీపాలు వెలిగించారు. కాగా, ఆదివారం రూ. 3లక్షల ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు.

27

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles