లక్ష్మీ, సరస్వతీ బరాజ్‌ల గేట్లు ఎత్తి వేత


Mon,November 4, 2019 02:42 AM

కాళేశ్వరం, నవంబర్ 03 : కాళేశ్వరం ప్రాజెక్టులోని లక్ష్మీ(మేడిగడ్డ), సరస్వతీ (అన్నారం)బరాజ్‌ల నుంచి గేట్లు ఎత్తి నీరును దిగువకు వదులుతున్నారు. మేడిగడ్డ బరాజ్‌లోకు ఇన్‌ఫ్లో 1,12,000 క్యూసెక్కులు రాగా, 13గేట్లు ఎత్తి 90వేల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నా రు. అన్నారం బరాజ్‌కు ఇన్ ఫ్లో 30వేలు రాగా, 3గేట్లు ఎత్తి 27వేల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు.


మేడిగడ్డ బరాజ్‌లో 05.485 టీఎంసీ నీరు నిల్వ ఉన్నట్లు ఇంజినీర్లు తెలిపారు. అన్నారం బరాజ్‌లో 10.87 టీఎంసీ సామర్థ్యానికి గాను ప్రస్తుతం బరాజ్‌లో 09.00 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు.

నిలకడగా గోదావరి..
ఎగువన వర్షాలు తగ్గుముఖం పట్టడంతో కాళేశ్వరం వద్ద గోదావరి నది ఆదివారం నిలకడగా ఉంది. గత కొన్ని రోజుల నుంచి కాళేశ్వరం పుష్కరఘాట్ మీదుగా ప్రవహించిన గోదావరి, ఆదివారం ప్రవాహం తగ్గడంతో మెట్ల కింది నుంచి ప్రవహిస్తోంది. పుష్కరఘాట్ వద్ద గోదావరి నది 1,12,000 క్యూసెక్కులుగా 5.30మీటర్ల ఎత్తులో ప్రవహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

37

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles