బొగత వద్ద పర్యాటకుల సందడి


Mon,November 4, 2019 02:42 AM

వాజేడు, నవంబర్ 03 : మండలంలోని చీకుపల్లి అటవీప్రాంతంలో ఉన్న తెలంగాణ నయాగార బొగత జలపాతం పర్యాటకులతో సందడిగా మారింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చి పర్యాటకులు జలపాతంలోని స్విమ్మింగ్‌ఫూల్‌లో స్నానాలు, ఈతలు కొడుతూ, సెల్ఫీలు దిగుతూ సరదగా గడిపారు. జలపాతం వద్ద ఉన్న హట్స్, పకోడలు, చిల్డ్రన్స్‌పార్క్‌లో తిరుగుతూ బొగత రెస్టారెంట్‌లో భోజనాలు చేసి సేదతీరారు. ఎఫ్‌ఆర్వో డోలి శంకర్ పర్యవేక్షణలో రక్షణ చర్యలు చేపట్టారు.


సిబ్బందిపై పర్యాటకుడి దురుసు ప్రవర్తన..
బొగత జలపాతాన్ని వీక్షించేందుకు వచ్చిన ఓ పర్యాటకుడు తమపై చిందులేశాడని ఇక్కడి రక్ష ణ కమిటీ సిబ్బంది పేర్కొన్నారు. బొగత పై భాగానికి ఎక్కుతున్న సదరు పర్యాటకుడిని అనుమతి లేకుండా పైకి ఎక్కరాదని అడ్డుకున్న తమపై దు రుసుగా ప్రవర్తించినట్లు వారు తెలిపారు. నేను పోలీసును.. మీరు బయటికి రండి.. మీ సంగతి చూస్తా నంటూ బెదిరింపులకు గురి చేసినట్లు వారు తెలిపారు. తమ మాటలు ఏ మాత్రం ప ట్టించుకోకుండా బొగత పై భాగానికి వెళ్లి స్నా నం చేసినట్లు వారు వెల్లడించారు.
అటవీశాఖ ఉన్నతాధికారుల అనుమతి మేరకే పైకి వెళ్లే వీలు ఉంటుందని, ఉన్నతాధికారులు స్పందించి ఈ విషయంపై విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా వారు కోరారు. కాగా, ఈ విషయమై వాజేడు ఎస్సై గుర్రం కృష్ణప్రసాద్‌ను ఫోన్‌లో నమస్తే తెలంగాణ సంప్రదించగా డిపార్ట్‌మెంట్‌కు చెందిన వారు వచ్చినట్లు తనకు సమాచారం లేదని ఆయన తెలిపారు. రక్ష ణ కమిటీ సిబ్బంది సైతం జరిగిన విషయాన్ని తన దృష్టికి తీసుకురాలేదన్నారు.

29

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles