మంగళప్రదంపై ఆశలు!


Sun,November 3, 2019 02:21 AM

-సడలింపు.. సానుకూలత
-5వ తేదీలోగా ఉద్యోగాల్లో చేరండి
-ఆర్టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్ పిలుపు
-మానవీయ కోణంలో ముఖ్యమంత్రి ప్రకటన
-కార్మికుల కుటుంబాల్లో పునరాలోచన?


(వరంగల్ ప్రధాన ప్రతినిధి-నమస్తే తెలంగాణ)ఆర్టీసీ కార్మికులకు, కార్మికుల కుటుంబాలకు ఒక సొదరుడిగా, ఉద్యమ నాయకుడిగా, ముఖ్యమంత్రిగా పిలుపునిస్తు న్నా. అసంబద్ధమైన, అన్యాయమైన సమ్మె విధానం నుంచి బ యటపడండి. యూనియన్ల మాయలో పడి కుటుంబాలను రోడ్డుపాలు చేసుకోకండి. సమ్మె విషయంలో పునరాలోచన చేయాలని కోరుతున్నా. అకారణంగా ఆర్టీసీ కార్మికుల కుటుంబాలను రోడ్డు మీద పడేయడం ప్రభుత్వ విధానం కాదు. నిజానికి సమ్మె అన్యాయమైనదని కార్మిక శాఖ తేల్చింది. మానవీయ కోణంలో, ఎలాంటి భేషజాలకు పోకుండా పునరాలోచన చేయండి. ఈ నెల 5 అర్ధరాత్రి (మంగళవారం అర్ధరాత్రి) వరకు భేషరతుగా ఉద్యోగాల్లో చేరండి. తరువాత చూద్దాం అని స్వయంగా సీఎం కేసీఆర్ ఆర్టీసీ కార్మికులకు పిలుపునిచ్చా రు. 29 రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న నేపథ్యం లో ఉత్పన్నమైన అంశాలతోపాటు రాష్ట్ర మంత్రివర్గం శనివా రం సుదీర్ఘంగా చర్చించి తీసుకున్న అనేకానేక (49) నిర్ణయా ల్లో ప్రజారవాణా, ఆర్టీసీ సమ్మె అనంతర పరిణామాలకు సంబంధించిన అంశంపైనా, ఆ పరిస్థితికి దారి తీసిన పరిస్థితులపైనా ఆయన రాష్ట్ర ప్రజలకు వివరించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె అన్యాయమై(ఇల్లీగల్)నదే అయినా మానవీయ కోణం లో ఆర్టీసీ కార్మికులు, వారి కుటుంబాలు రోడ్డు మీద పడొద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ప్రజారవాణా వ్యవస్థలో అనుసరిస్తున్న విధానాన్ని ఆయన వివరించారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరం సెప్టెంబర్‌లో తీసుకొచ్చిన మోటర్ వెహికిల్ యాక్ట్ ఆధారంగా నిర్ణయాలు తీసుకున్నామని పేర్కొంటూ.. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంలో రవాణా వ్యవస్థ ఉంటే ఆరోగ్యకరమైన పోటీ ఉంటుందని ఉద్ఘాటించారు.

ముఖ్యమంత్రిగా, రాష్ట్ర ప్రజలందరి యోగక్షేమాలు చూసే బాధ్యతాయుతమైన పాలకుడిగా, మానవీయకోణంలో, అన్నీ ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నామని సీఎం కేసీఆర్ స్వయంగా మీడియా సమావేశం నిర్వహించి ఈ విధంగా అప్పీల్ చేశారు. దీంతో సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు, వారి కుటుంబాలు పునరాలోచన చేస్తాయనే ఆశావహ సంకేతాలు అందుతున్నాయి. మొట్టమొదట ఒక్కసారి ఆర్టీసీ నుంచి, అదీ అసంబద్ధమైన, అన్యాయమైన సమ్మె అని, రేపటి సాయంత్రం 8 గంటల వరకు విధుల్లో చేరకపోతే వారు ఇక ఉద్యోగాలకు రాజీనామా చేసినట్టేనని కరాఖండిగా ప్రకటించిన ఆయన, మానవీయ కోణంలో సమ్మె విరమించండీ అనే పిలుపు ఇవ్వడమే కాదు, మంగళవారం అర్ధరాత్రి వరకు ఉద్యోగాల్లో చేరండీ అని పేర్కొనడంపై కార్మికులు, కార్మికుల కుటుంబాల్లో పునరాలోచన మొదలైనట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి అన్ని విషయా లు స్పష్టంగా చెప్పారు. అవన్నీ తమకూ తెలుసు. కానీ, సమష్టిగా సమ్మె నిర్ణయం తీసుకున్నామని, ఆలోచించి తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామని కార్మిక సంఘాలు పేర్కొంటున్నాయి. దేశవ్యాప్తంగా ప్రజా రవాణా వ్యవస్థపై అనుసరిస్తున్న విధానానికి తెలంగాణ ఏమాత్రం తీసిపోక తప్పదనే నిర్ణయం ప్రభుత్వం ప్రైవేట్ పరం చేసే విషయంలో తీసుకున్న నిర్ణయం నుంచి వెనుకడగు వేసేది లేదని తేలిపోయిన నేపథ్యంలో ఇంకా తెగేదాకా లాగొద్దన్న అభిప్రాయానికి ప్రజాసంఘాలు వస్తోండడం గమనార్హం.

మధ్యేమార్గంగా పరిష్కారాన్ని కనుగొనాలే కానీ, తాము పట్టుకున్న కుందేలుకు మూడేకాళ్లు అన్న చందంగా కార్మిక సంఘాలు వ్యవహరించకూడదని, పయ్యకదిలిస్తేనే పొయ్యి వెలిగే కుటుంబాలున్న నేపథ్యంలో స్వయంగా ముఖ్యమంత్రే భేషజాలకు పోకుండా భేషరతుగా వచ్చి విధుల్లో చేరండి. సంస్థను బతికించుకోవాలి. మీరు బతకాలన్న ఉద్దేశమే ప్రభుత్వానికి ఉంది కానీ, వేరే ఏ ఉద్దేశం లేదు అని స్పష్టంగా పేర్కొనడంతో పునరాలోచన దిశగా అడుగులు పడే సాకుకూల వాతావరణం నెలకొనే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇవ్వాటి నుంచి మంగళవారం అర్ధరాత్రి వరకు అసలు విషయం తేలినా ఇరువైపులా అటు అర్టీసీ కార్మికుల నిర్ణయం, ఆర్టీసీ మంగళానికి పట్టుపడతాయా? లే దా అదే తమ పాలిట మంగళ ప్రదమని భావిస్తాయా అన్నది తేలే అవకాశం ఉంది.

మొత్తానికి ఆర్టీసీని ప్రభుత్వంలో ఎట్టి పరిస్థితుల్లో విలీనం చేసేది లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 5100 రూ ట్లను ప్రైవేట్ పర్మిట్లు ఇచ్చేస్తాం. ఈ రెండు నిర్ణయాల్లో మార్పు ఏమీ లేదు. అది రాష్ట్ర మంత్రి మండలి తీసుకున్న నిర్ణయం కావడంతో దీనిలోనూ మార్పు ఉండే అవకాశం లేదని తేలిపోయింది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో మంగళవారం అర్ధరాత్రి నాటికి జరిగే పరిణామాలు ఏ దిశకు తీసుకెళ్లగలవు అం టే మెజారిటీవర్గం మాత్రం ఇంతకన్నా మధ్యేమార్గం లేదనే అభిప్రాయాలు వ్యక్తం చేయడం విశేషం.

57

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles