చికిత్స పొందుతూ విద్యార్థిని మృతి


Sun,November 3, 2019 02:19 AM

కాటారం, నవంబర్ 02 : మండలంలోని ఇబ్రహీంపల్లికి చెందిన నాగుల శ్రావణి(16) అనే పదో తరగతి విద్యార్థిని పురుగుల మందు తాగి దవాఖానలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. ఎస్సై ముత్తె నరేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. శ్రా వణి కాటారం మండలకేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నది. శ్రావణి కొం తకాలంగా తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతుండగా తల్లిదండ్రులు పలు దవాఖానల్లో చికిత్స చేయిస్తున్నారు. అయినా కడుపునొప్పి తగ్గకపోవడంతో వారం రోజులుగా పాఠశాలకు సైతం హాజరుకాలేదు. ఈ క్రమంలో జీవితంపై విరక్తి చెందిన శ్రావణి మంగళవారం ఇంట్లో పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబసభ్యులు పరకాలలోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ ఆమె మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. ఆమె తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

41

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles