పాన్ షాపులో చోరీ


Sun,November 3, 2019 02:18 AM

ఏటూరునాగారం, నవంబర్ 02 : మండల కేంద్రంలోని డిగ్రీ కళాశాల మూల ములుపులో జాతీయ రహదారిపై ఉన్న పాన్ షాపులో చోరీ జరిగింది. మండలకేంద్రానికి చెందిన మందపల్లి చంద్రం రెండు రోజుల క్రితం పాన్‌డబ్బాను పెట్టుకున్నాడు. కాగా, శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు డబ్బాకు ఉన్న రెండు తాళాలను పగులగొట్టి అందులో ఉన్న రూ. 2వేల విలువ చేసే సిగరెటు ప్యాకెట్లు, బిస్కెట్ ప్యాకెట్లు, పలు సామగ్రిని ఎత్తుకుపోయారు. రెండు రోజుల క్రితమే పెట్టుకున్న డబ్బాలో దొంగలు పడడంతో చంద్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు.

34

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles