బిల్ట్ సమస్యపై పల్లాను కలిసిన నాయకులు


Sun,November 3, 2019 02:18 AM

మంగపేట, నవంబర్ 2: కమలాపురం బిల్ట్ ఫ్యాక్టరీ సమస్యపై శాసన మండలి చీఫ్ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డిని శనివారం కలిసినట్లు టీఆర్‌ఎస్ కార్మిక విభాగం ములుగు నియోజకవర్గ అధ్యక్షుడు, బిల్ట్ కార్మిక జేఏసీ నాయకుడు ఎస్కే కూర్బాన్ అలీ తెలిపారు. ములుగు జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ సూచనల మేరకు టీఆర్‌ఎస్‌కేవీ రాష్ట్ర అధ్యక్షుడు జీ రాంబాబు యాదవ్‌తో కలిసి పల్లా రాజేశ్వర్‌రెడ్డిని కలిసి, ప్రస్తుత బిల్ట్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ, కార్మికుల పెండింగ్ వేతనాలు తదితర సమస్యలు ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. బిల్ట్‌కు రాష్ట్ర ప్రభుత్వం తరుపున తగిన చేయూతను అందించి, ఫ్యాక్టరీ రీఓపెన్ కావడానికి సహకరించాలని కోరగా, ఆయన సానుకూలంగా స్పందించినట్లు ఈ సందర్బంగా కూర్బాన్‌అలీ వివరించారు.

33

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles