కాజీపేట మీదుగా విశాఖ-సికింద్రాబాద్-విశాఖ వీక్లీ స్పెషల్ రైలు


Sat,November 2, 2019 02:05 AM

కాజీపేట, నవంబర్ 01: కాజీపేట రైల్వే జంక్షన్ మీదుగా విశాఖపట్నం-సికింద్రాబాద్-విశాఖపట్నం వీక్లీ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైలును నడుపుతున్నట్లు రైల్వే అధికారులు శుక్రవారం తెలిపారు. ఈ సెక్షన్‌లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని నవంబర్ నెలలో విశాఖ పట్నం-సికింద్రాబాద్- విశాఖపట్నం మధ్య 08521/ 08522 నంబర్‌లతో పది వీక్లీ స్పెషల్ రైళ్లను నడిపిస్తున్నారు. విశాఖపట్నం- సికింద్రాబాద్‌ల మధ్య నడిచే ఈ స్పెషల్ రైలు విశాఖపట్నంలో 08521 రైలు నంబర్‌తో నవంబర్ నెలలో 2, 9, 16, 23, 30 తేదీల్లో ప్రతి శనివారం రాత్రి 10.50 నిమిషాలకు బయలు దేరి తెల్లవారి ఆదివారం మధ్యాహ్నం 12 సికిందరాబాద్‌కు చేరుకుంటుందని చెప్పారు.


సికింద్రాబాద్- విశాఖపట్నం మధ్య నవంబర్ 3,10,17,24, డిసెంబర్ 01న సికింద్రాబాద్‌లో 08522 రైలు నెంబర్‌లో ప్రతి ఆదివారం సాయంత్రం నాల్గున్నరకు బయలు దేరి సోమవారం తెల్లవారు జామున 5 గంటలకు విశాఖ పట్నంకు చేరుకుంటుందని తెలిపారు. ఈ రైలు రాకపోకలలో దువ్వాడ, అనకాపల్లి, తుని, సామర్లకోట, రాజమం డ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, రాయణపాడు, ఖమ్మం, వరంగల్, కాజీపేట రైల్వే స్టేషన్‌న్లలో ఆగుతుందన్నారు. ఈ రైలు రెండు ఎస్‌ఎల్‌ఆర్‌లు, మూడు జనరల్ బోగీలు, ఏడు స్వీపర్ బోగీలు, మూడు ఏసీ త్రీ టైర్, ఒక ఏసీ టు టైర్‌లతో మొత్తం 16 బోగీలతో నడుస్తుందని తెలిపారు.

70

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles