4న కేడీసీలో మెగా జాబ్‌మేళా


Sat,November 2, 2019 02:05 AM

రెడ్డికాలనీ, నవంబర్ 01: హన్మకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల(కేడీసీ)లో ఈనెల 4న మెగా జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ పాము వెంకటేశ్వర్లు తెలిపారు. ఐసీఐసీఐ బ్యాంకులో సేల్స్ ఆఫీసర్ ఖాళీలకు ఏదైనా డిగ్రీ (బీఏ, బీకాం, బీఎస్సీ) ఉత్తీర్ణులై (బీటెక్, ఎంబీఏ కాకుండా) 20-26 సంవత్సరాల లోపు మధ్య ఉన్నవారు ఈ మేళాలో పాల్గొనవచ్చునని పేర్కొన్నారు. ఎంపికైన వారికి సంవత్సరానికి రూ.2.15 లక్షల జీతంతో పాటు ఇతర అలవెన్స్ ఉంటాయన్నారు. ఆసక్తిగల డిగ్రీ విద్యార్థులు కళాశాల ప్లేస్‌మెంట్ ఆఫీసర్ డాక్టర్ వాసం శ్రీనివాస్‌ను సంప్రదించాలని, 4న బయోడేటా, రెండు సెట్ల సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలతో ఉదయం 9 గంటలకు కేడీసీలో హాజరుకావాలని కోరారు. ఇతర వివరాల కోసం 98850 59533 నెంబర్‌లో సంప్రదించాలన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు వినియోగించుకోవాలని ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు, ప్లేస్‌మెంట్ ఆఫీసర్ శ్రీనివాస్ కోరారు.

39

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles