లక్ష్మీ బరాజ్‌లో 21 గేట్ల ఎత్తివేత


Sat,November 2, 2019 02:05 AM


మహదేవపూర్/ కాళేశ్వరం, నవంబర్ 1: తెలంగాణ ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులోని లక్ష్మీ (మేడిగడ్డ)బరాజ్‌లో శుక్రవారం 21 గేట్లను ఎత్తి నీటిని దిగువకు తరలిస్తున్నట్లు సంబంధిత ఇంజినీర్లు తెలిపారు. ప్రాణహిత ఉప్పొంగి ప్రవహిస్తూ లక్ష్మీ బరాజ్‌లో కలుస్తుండడంతో గేట్లు ఎత్తి నీటిని ది గువకు పంపిస్తున్నట్లు పేర్కొన్నా రు. నీటి ప్రవాహం పెరుగుతూ, తగ్గుతూ వస్తుండడంతో ఆ మేర కు గేట్ల సంఖ్య పెంచుతూ, తగ్గిస్తున్నామని వివరించారు. బరాజ్‌లో 95.30 మీటర్ల ఎత్తులో 5.02 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు పేర్కొన్నారు. 1.18లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, 1.40 లక్షల క్యూసెక్కుల ఔట్‌ఫ్లో కొనసాగుతున్నట్లు వెల్లడించారు.


సరస్వతీ బరాజ్‌లో 4 గేట్ల ఎత్తివేత
సరస్వతీ (అన్నారం)బరాజ్‌లో శుక్రవారం 4 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నట్లు అధికారులు వెల్లడించారు. బరాజ్‌కు 46,000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నదని, ఈ సందర్భంగా 4 గేట్లు ఎత్తి 36,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలినట్లు చెప్పారు. బరాజ్‌లో 9.00 టీఎంసీ నీరు నిల్వ ఉన్నట్లు వారు పేర్కొన్నారు.

కాళేశ్వరం వద్ద నిలకడగా..
కాళేశ్వరంలోని తివేణీ సంగమం వద్ద గోదావరి నిలకడగా ప్రవహిస్తున్నది. ఎగువన కురుస్తున్న వర్షాలతో పుష్కరఘాట్ పై నుంచి వరద పారుతున్నది. శుక్రవారం 1,18,000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. 6.30 మీటర్ల ఎత్తులో గోదావరి ప్రవహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

31

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles