కాళేశ్వరంలో హుండీల లెక్కింపు


Sat,November 2, 2019 02:05 AM

కాళేశ్వరం, నవంబర్ 1: కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయం లో హుండీలను శుక్రవారం లెక్కించారు. ఈ సందర్భంగా రూ. 28,27,621 ఆదాయం వచ్చినట్లు ఈవో మారుతి వివరించారు. ఆలయ ఆవరణంలో చైర్మన్ బొమ్మర వెంకటేశం, ధర్మకర్తల సమక్షంలో హుండీలను తెరిచారు. మూడు నెలలుగా భక్తులు హుండీ ల్లో వేసిన కానుకలు ఇరవై ఎనిమిది లక్షల ఇరవై ఏడు వేల ఆరువందల ఇరవై ఒక్కరూపాయి వచ్చినట్లు ఈవో తెలిపారు. నాణేలను శనివారం లెక్కించనున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు జరిగిన లెక్కింపులో సర్పంచ్ వసంత, ధర్మకర్తలు గంటా రాంనారాయణ, కోండ్ర ఓగేశ్, చల్లా కృష్ణారెడ్డి పాల్గొన్నారు.

28

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles