కాళేశ్వరంలో ఇన్‌చార్జి ఎస్పీ పూజలు


Sat,November 2, 2019 02:05 AM

కాళేశ్వరం, నవంబర్ 1: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో ములుగు ఎస్పీ, భూపాలపల్లి ఇన్‌చార్జి ఎస్పీ సం గ్రామ్‌సింగ్ జీ పాటిల్ శుక్రవారం కుటుంబ సమేతంగా పూజలు నిర్వహించారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆయన ఆలయానికి వచ్చారు. ఈ సందర్భంగా అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం గణపతి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వా మి వార్ల గర్భాలయంలో అభిషేకాలు జరిపించారు. పార్వతీ అమ్మవారి ఆలయంలో పూజలు చేశారు. కల్యాణ మండపంలో అర్చకులు ఆశీర్వదించారు. స్వామి వారి శేష వస్ర్తాలతో సన్మానించారు. అనంతరం వారు లక్ష్మీ (కన్నేపల్లి )పంప్‌హౌస్‌ను సందర్శించారు. వెంట ఎస్సై శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.

42

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles