విద్యార్థులు పార్రిశామిక వేత్తలుగా ఎదుగాలి


Sat,November 2, 2019 02:04 AM

సిద్ధార్థనగర్, సెప్టెంబర్ 01: విద్యార్థులు పారిశ్రామిక వేత్తలుగా ఎదుగాలని డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండి యా డాక్టర్ సోమాని కోరారు. వడ్డెపల్లి సేయింట్ పీటర్స్ ఫార్మసీ కళాశాలలో శుక్రవారం ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ కాలేజెస్ ఆఫ్ ఫార్మసీ ఆధ్వర్యంలో ఫార్మాస్యూటికల్ సైన్సెస్ కాంగ్రెస్-2019 2వ జాతీయ సదస్సు నిర్వహించారు. ఇందులో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాలు చు రుకుగా ఉండటంతో ఫార్మసీ విద్యార్థులకు మంచి డిమాండ్‌తో పాటు భవిష్యత్ ఉందని, డిజిటల్ యుగంలో మారుతున్న వైద్య సాంకేతికతతో పోటీ పడాలని సూచించారు. విద్యార్థులు ఎల్లప్పుడు సామాన్యమైన ఆలోచనలు కలిగి ఉండకుండా లక్ష్యంగా చేసుకుని అధికంగా ఆలోచించాలని సలహా ఇచ్చారు. ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రెసిడెం ట్ డాక్టర్ బి.సురేశ్, అరబిందో ఫార్మా మేనేజింగ్ డైరెక్టర్ మదన్‌మోహన్‌రెడ్డి, సేయింట్ పీటర్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ చైర్మన్ జయపాల్‌రెడ్డి, ఎమ్‌ఎస్‌ఎన్ ల్యాబ్స్ హైదరాబాద్ మేనేజింగ్ డైరెక్టర్ భరత్‌రెడ్డి, విర్చో బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ డాక్టర్ హేమంత్, నాట్కో ఫార్మా ఇండియా డైరెక్టర్ ఎంయూఆర్ నాయుడు, దేశ్‌పాండే, ఎస్‌డీ సిన్హా, వెంకట్‌రెడ్డి, రామ్‌కిషన్, నారాయణ, చైర్మన్ బాలారెడ్డి, నారాయణరెడ్డి పాల్గొన్నారు.

37

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles