మినీట్యాంక్ బండ్ పనులు త్వరగా చేపట్టాలి


Fri,November 1, 2019 02:33 AM

జయశంకర్ భూపాలపల్లి కలెక్టరేట్, అక్టోబర్ 31: మినీ ట్యాంక్‌బండ్ నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు నీటిపారుదలశాఖ అధికారులను ఆదేశించారు. భూపాలపల్లి మండలంలోని పుల్లూరు రామయ్యపల్లి తుమ్మల చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా తీర్చిదిద్దుతుండగా, పనులను అధికారులతో కలిసి గురువారం పరిశీలించారు. అనం తరం మాట్లాడుతూ పట్టణ ప్రజలకు మినీ ట్యాంక్‌బం డ్ త్వరగా అందుబాటులోకి వచ్చేలా పనులను వేగవం తం చేయాలని సూచించారు. చెరువు కట్టను వెడల్పు చేసిన నేపథ్యంలో వాకర్లు ఉదయం, సాయంత్రం వాకింగ్ చేసేలా చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. లైటింగ్ సిస్టం ఏర్పాటు చేసి, బేంచీలు వేయాలని, చెరువును సుందరంగా తీర్చిదిద్దాలని సూచించారు. ట్యాంక్‌బండ్ నిర్మాణానికి మాత్రమే అనుమతి వచ్చిందని నీటిపారుదల శాఖ అధికారులు కలెక్టర్‌కు వివరించారు. చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్, లైటింగ్ సిస్టం, బేంచీల ఏర్పాటుకు ఉన్నతాధికారులకు లేఖ రాయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. వారి వెంట ఇరిగేషన్ డీఈ ప్రకాశ్, ఏఈ షర్పుద్దీన్, కాంట్రాక్టర్ ఆనంద్‌కుమార్ తదితరులున్నారు.

38

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles